హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: 72 మంది ఎంపీలకు వీడ్కోలు.. చదవు కంటే అనుభవ జ్ఞానమే గొప్పదన్న ప్రధాని మోదీ

PM Modi: 72 మంది ఎంపీలకు వీడ్కోలు.. చదవు కంటే అనుభవ జ్ఞానమే గొప్పదన్న ప్రధాని మోదీ

సొంత అనుభవం ద్వారా సంపాదించుకునే జ్ఞానం శక్తిమంతమైనదని, దానిని దేశానికి పంచి, యువతకు ఆదర్శంగా నిలవాలంటూ రాజ్యసభ నుంచి రిటైరవుతోన్న 72 మంది ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

  చదువుకోవడం ద్వారా పొందే జ్ఞానం కంటే స్వీయ అనుభవంతో సమకూర్చుకునే జ్ఞానమే శక్తిమంతమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి చేసుకున్న వివిధ పార్టీలకు చెందిన 72మంది ఎంపీలకు వీడ్కోలు పలుకుతూ గురువారం రాస్యసభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. జనజీవితంలో సుదీర్ఘ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్న నేతలంతా దేశ హితం కోసం దానిని నలుదిశలా వ్యాపింపజేయాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. రిటైరైన ఎంపీలందరూ తిరిగి రాజ్యసభలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

  రాజ్యసభలో పదవీ కాలం పూర్తయిన 72మంది సభ్యులకు ఇవాళ పార్లమెంటులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకోసం రాజ్యసభ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేశారు. రాజ్యసభను వీడుతోన్న ఎంపీలు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. రిటైరైన, మరికొద్ది రోజుల్లో కాబోతోన్న 72 మంది ఎంపీలతో ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ సభాపక్షనేత మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను మోదీ ఆప్యాయంగా పలకరించారు.

  రాజ్యసభ నుంచి 72 మంది ఎంపీల రిటైర్మెంట్

  KCR ఇష్టం, కానీ MLAsతో కష్టం -సిట్టింగ్‌లపై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రిపోర్ట్ -వీరికి ఈసారి టికెట్ లేనట్టే

  చట్టసభ్యులందరూ అంకితభావం, మెరుగైన పనితీరు, విధానపరమైన సమగ్రతతో నడుచుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. చట్టాలను రూపొందించే సంస్థలకు విఘాతం కలగించకుండా ఉండాలని అన్నారు. సభ్యుల ఆందోళన కారణంగా 2017 నుంచి 35శాతం సభా సమయం వృథా అయిందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

  రిటైర్ ఎంపీలతో మోదీ, వెకయ్య, ఓం బిర్లా ఫొటో

  Srisailam: శ్రీశైలంలో కర్ణాటక భక్తుల బీభత్సం.. ఆలయం వద్ద దుకాణాలకు నిప్పు.. ఏం జరిగిందంటే..

  పార్లమెంటులో వీడ్కోలు తర్వాత నేటి సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో 72 మంది రాజ్యసబ సభ్యులకు విందు ఏర్పాటుచేశారు. పదవీకాలం పూర్తికానున్న వారిలో ఏకే ఆంటోని, అంబికా సోని, పీ చిదంబరం, ఆనంద్ శర్మ, సురేశ్ ప్రభు, ప్రఫుల్​ పటేల్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రసన్న ఆచార్య, సంజయ్​ రౌత్​, నరేశ్ గుర్జాల్​, సతీష్ చంద్ర మిశ్ర, ఎంసీ మేరీ కోమ్, స్వపన్ దాస్ గుప్తా, నరేంద్ర జాధవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తెలుగురాష్ట్రాల నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభు, విజయసాయిరెడ్డి, డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉన్నారు.

  First published:

  ఉత్తమ కథలు