PM MODI : భారత దేశ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహా వీరుడు గొప్ప స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్( Netaji Subhas Chandra Bose).నేడు నేతాజీ 125వ జయంతి. నేతాజీ జయంతిని పురష్కరించుకుని ఇవాళ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆవిష్కరించారు.హోలోగ్రామ్ విగ్రహంసైజ్ 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ హోలోగ్రామ్ విగ్రహం 30 వేల ల్యూమెన్స్ 4కె ప్రొజెక్టర్‌తో పనిచేస్తుంది. 90 శాతం పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేశారు.
నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే వేడుకల్లో భాగంగా.. స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటానికి.. పరాక్రమానికి నివాళిగా గ్రానైట్‌తో తయారు చేసిన విగ్రహాన్ని(Netaji Subhas Chandra Bose Statue)కేంద్ర ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. అయితే గ్రానైట్ విగ్రహానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు.. ఈరోజు ఆవిష్కరింపబడిన ప్రదేశంలో నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఉంటుంది.
బ్రిటీష్ చక్రవర్తి జార్జ్-5 విగ్రహం, 1968 వరకు ఇండియా గేట్(India Gate) వద్దే ఉంది. 1938లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం 21 సంవత్సరాల పాటు అక్కడే ఉంది. అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్ధాల తర్వాత కూడా ఆ విగ్రహం అక్కడే ఉండేది. 1968లో ఇండియా గేట్ నుంచి ఆ విగ్రహాన్ని తొలిగించి, వాయువ్య ఢిల్లీలోని బురారీ సమీపంలో ఉన్న కరోనేషన్ పార్క్‌కు తరలించారు. అర్ధ శతాబ్ధానికి పైగా ఖాళీగా ఉన్న ఈ ఛత్రం, ఇప్పుడు మరోసారి ప్రజలను ఆకర్షించనుంది. ఇక్కడే 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పున్న గ్రానైట్‌తో చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
ALSO READ PMRBP 2022 : బాల పురస్కార్ అవార్డీస్ తో భేటీ కానున్న మోదీ..వైజాగ్ బాలికతో ప్రధాని ముఖాముఖIndia Gate
ఇండియా గేట్ దగ్గర నేతాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కేవలం జాతీయవాద గర్వకారణం(PRIDE)మాత్రమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో మన దేశం కోల్పోయిన ఒక విప్లవ నాయకుడికి నివాళులు అర్పించేందుకు భారతదేశం నిలబడిందని ప్రపంచానికి ఇచ్చే ఒక సందేశం కూడా. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రధాని మోదీ క్షణికావేశంలో తీసుకోలేదని, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు చారిత్రక డాక్యుమెంట్స్ ను నిర్వహిస్తున్న వారితో తీవ్రమైన చర్చల ద్వారాఈ నిర్ణయం తీసుకోబడినట్లు కేంద్రప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు.
ఓ మాజీ విదేశాంగ కార్యదర్శి తెలిపిన ప్రకారం..., నేతాజీ విగ్రహం కూడా భారతదేశంయొక్క ధృవీకరణగా ఉంద. ఇది ఇకపై భారత్ పాశ్చాత్య సంస్కృతి లేదా ప్రమాణాల ద్వారా జడ్జ్ చేయబడదు అని సూచిస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా నేతాజీ విగ్రహాన్ని 1975 జనవరి 23న ఎడ్వర్డ్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. భారతదేశ రాజధానిలో స్థాపించిన తొలి నేతాజీ విగ్రహం ఇదే. అయితే నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గర ప్రతిష్టిస్తామని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత గణతంత్ర వేడుకలు జనవరి 23న ప్రారంభించి, గాంధీ హత్యకు గురైన 30వ తేదీతో ముగిస్తామని అంతకుముందే ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటితోపాటు అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేస్తామని ప్రకటించింది. అనుకున్నట్లుగా విలీనం చేసింది. దశాబ్ధాలుగా ఇండియా గేట్ వద్ద నిరంతరంగా వెలుగిన అమర జవాను జ్యోతిని విలీనం చేయడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నిర్ణయం పలువురిని నిరాశకు గురి చేసింది. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద ఈ జ్యోతిని ఏర్పాటు చేశారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ జ్యోతి ప్రజ్వలన చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi