Home /News /national /

PM MODI UNVEILS 108 FEET LORD HANUMAN STATUE IN MORBI IN GUJARAT ON HANUMAN JAYANTI TODAY MKS

Hanuman Jayanti 2022: గుజరాత్ మోర్బీలో 108 అడుగుల భారీ విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోదీ

గుజరాత్ మోర్బీలోని 108 అడుగుల హనుమాన్ విగ్రహం

గుజరాత్ మోర్బీలోని 108 అడుగుల హనుమాన్ విగ్రహం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ భారీ హనుమాన్ విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించిన ప్రధాని మోదీ త్వరలోనే సొంత రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్లనున్నారు.

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుక ఘనంగా కొనసాగుతోన్న వేళ గుజరాత్ లో ఉత్సవాల హోరును మరింత పెంచుతూ భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గుజరాత్ లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

కేంద్రం ప్రతిష్టాత్మక తలపెట్టిన ‘హనుమాన్జీ చార్ ధామ్’ప్రాజెక్టులో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. పశ్చిమ రాష్ట్రం గుజరాత్ లో మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

CM KCR: కేసీఆర్ దూకుడు.. మళ్లీ ఢిల్లీకి.. ఈసారి లఖీంపూర్ ఖేరీ సందర్శన.. బీజేపీపై పోరు ఉధృతం!


హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిమ్లాలోని జాఖూలో నిర్మించిన హనుమాన్‌ విగ్రహం ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు పొందింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్‌, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు. విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయడానికి కారణం కూడా వుంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రాంతం కూడా ఎత్తుగా వుండడంతో విగ్రహం కూడా బాగా పెద్దదిగా కనిపిస్తుంది.

Ilayaraja: ఇళయరాజా.. ఇజ్జత్ ఉందా? -మోదీని అంబేద్కర్‌తో పోల్చిన మెస్ట్రోపై విమర్శల వెల్లువ


మరికొద్ది రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ భారీ హనుమాన్ విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించిన ప్రధాని మోదీ త్వరలోనే సొంత రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్లనున్నారు. సోమవారం(ఏప్రిల్ 18) నుంచి ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటిస్తారు. మొత్తం మూడు రోజులపాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఎన్నికలకు బీజేపీని సమాయత్తం చేయనున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Gujarat, Lord Hanuman, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు