Home /News /national /

PM MODI TO TRANSFER RS 1000 CRORE TO SHG WOMEN IN UP PRAYAGRAJ NUTRITION MANUFACTURING UNITS ALSO MKS

మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.1000 కోట్లు.. అమ్మాయిలకు మరో రూ.20కోట్లు.. నేడే భారీ నగదు బదిలీ..

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

మొత్తంగా 16 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చుతూ భారీ ఎత్తున రూ.1000 కోట్ల నగదును వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శాపిల్ చెక్కులు అందుకోనున్న మహిళలు.. ఆయనతో ముచ్చటించనున్నారు. మరోవైపు రాష్ట్ర సర్కారు సైతం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన నిథి నుంచి రూ.20కోట్లను పంపిణీ చేయనుంది..

ఇంకా చదవండి ...
మహిళా సాధికారతకు, అమ్మాయిల సంరక్షణకు కట్టుబడి ఉంటామనే బీజేపీ సర్కార్ ఆ దిశగా ఇవాళ కీలక చర్యలు చేపట్టింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 16 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చుతూ భారీ ఎత్తున రూ.1000 కోట్ల నగదును వారి ఖాతాల్లోకి జమ చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శాపిల్ చెక్కులు అందుకోనున్న మహిళలు.. ఆయనతో ముచ్చటించనున్నారు. మరోవైపు రాష్ట్ర సర్కారు సైతం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన నిథి నుంచి రూ.20కోట్లను పంపిణీ చేయనుండగా, వాటిని కూడా మోదీనే బదిలీ చేయనున్నారు. ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పాల్గొనబోయే ప్రధాన కార్యక్రమం ఇదే. ప్రయాగ్ రాజ్ లో మంగళవారం జరుగనున్న భారీ బహిరంగ సభ మహిళలే ప్రాధాన్యంగా సాగనుంది. వివరాలివి..

కేంద్రంలో అధికార కైవసానికి కీలకంగా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉంటోన్న ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఈసీ షెడ్యూల్ ప్రకటన కంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ భారీ ప్రాజెక్టులను వరుసపెట్టి ప్రారంభిస్తుండటం తెలిసిందే. ఇవాళ కూడా 202 సప్లిమెంటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో భారీ సంఖ్యలో మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. 2లక్షల మంది మహిళలతో ఇవాళ ప్రయాగ్ రాజ్ లో జరగనున్న సభలో ప్రధాని ఈ మేరకు పంపకాలు చేయనున్నారు.

shocking : దొరక్క దొరక్క దొరికింది.. అనుకునేలోపే సాంతం దోచేసింది.. ముదురు పెళ్లికూతురా మజాకా!దాదాపు 16లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరేలా వారి బ్యాంక్ ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.1000 కోట్లు జమ చేయనున్నారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద ఈ డబ్బును మహిళల ఖాతాల్లో వేయనున్నారు. 80 వేల స్వయం సహాయక సంఘాలకు చెందిన ఒక్కో గ్రూపునకు రూ.1.10 లక్షల చొప్పున రూ. 880 కోట్ల సీఐఎఫ్‌ను కూడా ప్రధాని మోదీ ఇవ్వనున్నారు. దీంతో పాటు 60 వేల స్వయం సహాయక సంఘాలకు ఒక్కో గ్రూపునకు 15 వేల రూపాయల చొప్పున మొత్తం 120 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. అదే చేత్తో యూపీ సర్కారు వారి కన్యా సుమంగళ పథకానికి సైతం ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

wife delivery : నువ్వేం మనిషివయ్యా!! -YouTubeలో చూస్తూ భార్యకు ప్రసవం.. చివరికి ఇలా..కన్యా సుమంగళ పథకం కింద లక్ష మంది లబ్ధిదారులకు రూ.20కోట్లకుపైగా నగదును ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ పథకం కింద బాలికల జీవితంలో వివిధ దశల్లో మొత్తం రూ.15వేల నగదు బదిలీ జరుగనున్నది. పుట్టిన సమయంలో రూ.2వేలు, ఏడాది టీకాల తర్వాత రూ.1000, ఒకటో తరగతిలో చేరిన సమయంలో రూ.2వేలు, ఆరో తరగతిలో చేరిన తర్వాత రూ.2వేలు, తొమ్మిది తరగతిలో ప్రవేశం అనంతరం రూ.3వేలు, పది లేదంటే ఇంటర్‌లో ఉత్తీర్ణత అనంతరం, డిగ్రీ ఇతర డిప్లొమా కోర్సుల్లో చేరిన అనంతరం రూ.5వేలు బాలికల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అద్బుతమైన టైమ్ మెషీన్‌.. ఖగోళ రహస్యాలు చూడొచ్చు.. James Webb Space Telescope లాంఛ్..


ప్రయాగ్ రాజ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మహిళల ఖాతాలకు రూ.1000 కోట్లు బదిలీ చేయడంతోపాటు 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేస్తారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 78 మంది మహిళలతో ప్రధాని నేరుగా మాట్లాడుతారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బహ్మ్రౌలి విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కణ్నుంచి నేరుగా సభా స్థలికి వెళతారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు రాష్ట్రంలోని కీలక మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జనవరి తొలివారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Self help groups, Uttar pradesh, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు