హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : కరోనా విలయం: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేరుగా ముఖ్యమంత్రులతోనే..

PM Modi : కరోనా విలయం: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. నేరుగా ముఖ్యమంత్రులతోనే..

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. సీఎంలతో పీఎం వర్చువల్ సమావేశం గురువారం జరగనుందని పీఎంవో వర్గాలు మంగళవారం ప్రకటించాయి.

దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకూ కఠినంగా మారుతోన్న నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను హెచ్చరిస్తూ వస్తోంది. అయినాకూడా వైరస్ భయానకంగా వ్యాపిస్తుండటం, మరణాలు భారీగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తున్నది. వైరస్ కట్టడి చర్యలు, హెల్త్ ఎమర్జెన్సీ తరహా విధుల నిర్వహణపై ఇప్పటికే సమీక్షలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. సీఎంలతో పీఎం వర్చువల్ సమావేశం గురువారం జరగనుంది. ఈ విషయాన్ని పీఎంవో, ఇతర శాఖలూ ధృవీకరించాయి.

ఏడు నెలల తర్వాత దేశంలో కరోనా కేసులు మళ్లీ తిరగబెట్టడం, ప్రస్తుతం కొనసాగుతున్నది మూడో వేవ్ అని నిపుణులు నిర్ధారించిన దరిమిలా, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని మోదీ మొన్న ఆదివారం(ఈనెల 9న) ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ, హోం శాఖ, రైల్వే శాఖ, విమానయాన శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివ్యూలో కేంద్రం నిర్ణయాలపై ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో భేటీ కావాల్సింది. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రే సీఎంలతో సమావేశం కానుండగం గమనార్హం.

Pig Heart In Human: వైద్య చరిత్రలో అద్భుతం: మనిషికి పంది గుండె అమర్చిన డాక్టర్లు

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చడం, వ్యాక్సిన్ల పంపిణీని మిషన్ మోడల్ లో కొనసాగించడం, ఆక్సిజన్ సహా మెడికల్ అవసరాలకు సిద్ధం చేసుకోవడం లాంటి విషయాలపై రివ్యూలో ప్రధాని కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గురువారం జరగబోయే ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో కొవిడ్ ఆంక్షల పెంపు దిశగా నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది.

First published:

Tags: Coronavirus, Covid, Covid cases, India, Omicron, Pm modi

ఉత్తమ కథలు