పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న మోదీ.. నేడు ప్రత్యేక పోర్టల్ ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)

పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 'ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ - హానరింగ్ ద హానెస్ట్' వేదికను ప్రారంభించనున్నారు.

 • Share this:
  పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడంతో పాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 'ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ - హానరింగ్ ది హానెస్ట్' వేదికను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్లు, ట్రేడ్ అసోసియేషన్లు, వివిధ వాణిజ్య మండలితో పాటు ప్రముఖ చెల్లింపుదారులు కూడా వీక్షించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

  ఆగస్టు 13న ఉదయం 11 గంటలకు 'పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం' వేదికను ప్రారంభించనున్నాం. పన్ను వ్యవస్థలో సంస్కరణతో పాటు సరళతరం చేసేందుకు ఇది మరింత దోహదపడనుంది. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి, జాతి అభివృద్ధికి కృషిచేస్తున్న వారికి ఇది ఎంతో మేలు చేకూర్చుతుంది.
  ప్రధాని మోదీ
  పన్నుల చెల్లింపునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ - ఇన్ కమ్ ట్యాక్స్ (CBDT) ఇటీవల ఎన్నో సంస్కరణలను తెచ్చింది. గత ఏడాది కార్పొరేట్ ట్యక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అంతేకాదు నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి తగ్గించారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌‌ను కూడా తొలగించారు. పన్ను విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ఇప్పుడీ కొత్త వేదికను ప్రారంభిస్తున్నారు.


  Published by:Shiva Kumar Addula
  First published: