Home /News /national /

PM MODI TO LAND AT NEW DELHI SOON PALAM AIRPORT CROWDED WITH BJP SUPPORTERS BA

Modi Returns | ప్రధాని మోదీ ఆగమనం.. నమో నామస్మరణతో మార్మోగిపోతున్న ఎయిర్‌పోర్ట్

మోదీకి స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు

మోదీకి స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు

విమానాశ్రయం వద్దకు వేలాదిగా బీజేపీకార్యకర్తలు తరలివచ్చారు. మోదీ.. మోదీ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు మార్మోగిపోతున్నాయి.

    అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తిరిగివచ్చారు. అమెరికా టూర్‌ను విజయవంతంగా ముగించుకుని వస్తున్న ప్రధాని మోదీకి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ధూంధాంగా ఏర్పాట్లు చేశాయి. విమానాశ్రయం వద్దకు వేలాదిగా బీజేపీకార్యకర్తలు తరలివచ్చారు. మోదీ.. మోదీ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగనుంది. ఒక కిలోమీటర్ దూరం ప్రధాని మోదీ నడుస్తూ వెళ్తారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి అభివాదం తెలుపుతారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీపులో మోదీ ప్రయాణించనున్నారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వరకు ప్రధాని మోదీకి అడుగడుగునా నీరాజనం పట్టేందుకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికే క్రమంలో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. దేశంలోని భిన్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా, నృత్యాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో నరేంద్రుడికి స్వాగతం పలకనున్నారు.

    రెండోసారి ప్రధాని అయ్యాక తొలిసారి అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ.. హ్యూస్టన్‌లో జరిగిన #HowdyModi సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికన్ కంపెనీల సీఈవోలతో బ్లూమ్‌బర్గ్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీలను ఆహ్వానించారు. ఈనెల 27న ఐరాస సాధారణ అసెంబ్లీ 74వ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత ఐదేళ్లలో భారత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను వెల్లడించారు. ఉగ్రవాదం వల్ల భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచమానవాళి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్, కాశ్మీర్ పేరు ఎత్తకుండా ఉగ్రవాదంపై ప్రసంగించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bjp, New Delhi, Pm modi

    తదుపరి వార్తలు