హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: పంద్రాగస్టు రోజు ఎర్రకోటకు ముఖ్య అతిథులు వాళ్లే.. ప్రధాని మోదీ నిర్ణయం..

PM Modi: పంద్రాగస్టు రోజు ఎర్రకోటకు ముఖ్య అతిథులు వాళ్లే.. ప్రధాని మోదీ నిర్ణయం..

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

PM Modi: పంద్రాగస్టు రోజును ఒలంపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ ముచ్చటించనున్నారు.

  టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులను ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. ఆ రోజు వారిని కలవనున్న ప్రధాని మోదీ వారితో ముచ్చటించనున్నారు. అనంతరం వారిని తన నివాసానికి కూడా ఆహ్వానించనున్నారు. ఇప్పటివరకు ఒలంపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి చాను రజత పతకం సాధించగా.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. గత నెల 23న ప్రారంభమైన ఒలంపిక్స్ క్రీడలు.. ఈ నెల 8తో ముగియనున్నాయి. అంతకుముందు ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడిన ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

  క్రీడాకారులు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరారు. దేశం మొత్తం మీ వెంట ఉంటుందని అన్నారు. ఆ తరువాత మన్‌కీ బాత్‌లో కూడా ప్రధాని మోదీ ఒలంపిక్స్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఒలంపిక్స్‌లో పతకం సాధించేందుకు పోరాడిన పలువురికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మోదీ. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సూచించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Independence Day 2021, Pm modi, Tokyo Olympics

  ఉత్తమ కథలు