రూ.50వేల కోట్ల భారీ ప్యాకేజీ... 20న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Garib Kalyan Rojgar Abhiyaan | సొంతూళ్లకు వచ్చిన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

news18-telugu
Updated: June 18, 2020, 5:58 PM IST
రూ.50వేల కోట్ల భారీ ప్యాకేజీ... 20న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ
  • Share this:
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తాముపనిచేస్తున్న ప్రాంతాల్లో ఉపాధి దొరక్క సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేసిన కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వారికి ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని ప్రారంభించనుంది. గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. వలస కార్మికులు భారీగా తిరిగి వచ్చిన 116 జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఆ జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ‘మొత్తం 116 జిల్లాలకు వలస కార్మికులు ఎక్కువ శాతం తిరిగి వచ్చినట్టు గుర్తించాం. బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20న పథకాన్ని ప్రారంభిస్తారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులు లబ్ధిపొందుతారు.’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. సుమారు 25,000 మందికి లబ్ధి జరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
First published: June 18, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading