పాక్ ప్రధానికి కృతజ్ఞతలు... ప్రధాని మోదీ

కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

news18-telugu
Updated: November 9, 2019, 1:16 PM IST
పాక్ ప్రధానికి కృతజ్ఞతలు... ప్రధాని మోదీ
ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ
  • Share this:
కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం కృషి చేసిన పాక్ ప్రధానితో పాటు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. డేరా బాబా నానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ని ప్రారంభించారు. గురు నానక్ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

అమృత్‌సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన వివరించారు. జమ్మూ కశ్మీర్, లద్దాక్‌లలో ఆర్టికల్ 370 రద్దుతో సిక్కులకు విశేష లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా దేశ ప్రజలతో సమానంగా హక్కులను పొందుతారని స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 9, 2019, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading