• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PM MODI SWADESHI SLOGAN IMPLEMENTATION STARTS FROM PARAMILITARY CANTEENS WILL SELL ONLY INDIGENOUS PRODUCTS FROM JUNE 1 AK

మోదీ ‘స్వదేశీ’ పిలుపు... అక్కడి నుంచే మొదలు

మోదీ ‘స్వదేశీ’ పిలుపు... అక్కడి నుంచే మొదలు

ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)

దేశ ప్రజలు కూడా దేశీయ ఉత్పత్తులనే ఎక్కువగా వినియోగించి ఇక్కడి వారిని ప్రొత్సహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

  • Share this:
    జూన్ 1 నుంచి కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో దేశీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపు నేపథ్యంలో కేంద్ర ఆర్మీ సంస్థలకు అమిత్ షా ఈ మేరకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కూడా దేశీయ ఉత్పత్తులనే ఎక్కువగా వినియోగించి ఇక్కడి వారిని ప్రొత్సహించాలని అన్నారు. కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో జూన్ 1 నుంచి కేవలం దేశీయ ఉత్పత్తులను మాత్రం విక్రయిస్తారని… పది లక్షల మంది బలగాలకు చెందిన 50 లక్షల మంది కుటుంబసభ్యులు ఈ ఉత్పత్తులనే వినియోగిస్తారని అమిత్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ సహా పలు కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో ఏడాదికి రూ. 2800 కోట్ల ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రతి భారతీయుడు దేశీయ ఉత్పత్తులనే వినియోగించాలని ప్రతిజ్ఞ చేస్తే... ఐదేళ్లలో మన దేశం ఈ అంశంలో విజయం సాధిస్తుందని... స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

    నిన్న జాతీనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ... ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం స్థానికమే మనల్ని కాపాడిందన్న ఆయన... అది అవసరం కాదని, మన బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానికత మన జీవన మంత్రగా మార్చుకోవాలని కాలం మనకు నేర్పించిందని చెప్పారు. ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఒకప్పుడు లోకలే అని... ప్రజలు వాటిని ఆదరించడం వల్లే గ్లోబల్‌గా మారాయని మోదీ అన్నారు. మనం స్థానిక ఉత్పత్తులనే వాడాలని... వాటిని ప్రమోట్ చేయాలని అన్నారు. భారత్‌లో అనేక వనరులు ఉన్నాయని... ఉత్తమ ఉత్పత్తులతో క్వాలిటీ, సప్లై చైన్‌ను మెరుగుపరవచ్చని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు