PM Modi Speech: నవంబరు ఆఖరు వరకు ఉచిత రేషన్: ప్రధాని మోదీ

రాబోయే రోజుల్లో జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముడతాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2లోకి ప్రవేశించామని చెప్పారు. సమయానుగుణంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనాను కట్టడి చేయగలిగామని తెలిపారు ప్రధాని.

news18-telugu
Updated: June 30, 2020, 4:46 PM IST
PM Modi Speech: నవంబరు ఆఖరు వరకు ఉచిత రేషన్: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
మన దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని.. ఐతే అన్‌లాక్ 1 తర్వాత నిర్లక్ష్యం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో జలుబు, జ్వరం వంటి వ్యాధులు చుట్టుముడతాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2లోకి ప్రవేశించామని చెప్పారు.
సమయానుగుణంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనాను కట్టడి చేయగలిగామని తెలిపారు ప్రధాని. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నవంబరు ఆఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.



కంటైన్‌మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరైతే కరోనా నిబంధనలను పాటించరో వారికి జరిమానాలు విధించాలి. మాస్క్ ధరించనందుకు దేశ ప్రధానికే రూ.13 వేలు జరిమానా విధించారు. దేశంలో కూడా అలాంటి నిబంధనలు అమలు చేయాలి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన తీసుకొచ్చాం. వారి కోసం రూ.2వేల కోట్లు కేటాయిచాం. ఈ కష్ట కాలంలో ఏ ఒక్కరు ఆకలితో నిద్రపోకుండా చర్యలు తీసుకోగలిగాం. గరీబ్ కల్యాణ్ యోజన కోసం 1.75 లక్షల కోట్లు కేటాయించాం. 20 కోట్ల మంది పేదల ఖాతాల్లో 31వేల కోట్ల నగదును డిపాజిట్ చేశాం. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18వేల కోట్ల నగదు జమయింది.
ప్రధాని మోదీ



''రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే నవంబరు ఆఖరు వరకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. రూ. 90వేల కోట్లను అదనంగా కేటాయిస్తున్నాం. ఈ పథకం కింద 80 కోట్ల మంది ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు, కుటుంబానికి నెలకు కిలో చొప్పున కందిపప్పు ఇస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది.'' అని ప్రధాని మోదీ అన్నారు.
First published: June 30, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading