హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : తేజస్వీ యాదవ్ కి ప్రధాని మోదీ ఫోన్..లాలూ ఆరోగ్యం గురించి వాకబు

PM Modi : తేజస్వీ యాదవ్ కి ప్రధాని మోదీ ఫోన్..లాలూ ఆరోగ్యం గురించి వాకబు

లాలూ ఆరోగ్యం గురించి మోదీ వాకబు

లాలూ ఆరోగ్యం గురించి మోదీ వాకబు

లాలూప్రసాద్‌ యాదవ్‌కి సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌ డాక్టర్లు రోహిణి ఆచార్య కిడ్నీని తీసి..ఆమె తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి అమర్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PM Modi speaks to Tejashwi Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేజీ నేత లాలూ ప్రసాద్‌(Lalu prasad yadav) గత కొంతకాలంగా యాదవ్‌ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వైద్యులు ఆయన్ని పరీక్షించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్(Kidney transplant) చేయాలని సూచించారు. అయితే ఈవిషయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి కిడ్నీ దానం చేయడానికి ఆయన పెద్ద కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. లాలూప్రసాద్‌ యాదవ్‌కి సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌ డాక్టర్లు రోహిణి ఆచార్య కిడ్నీని తీసి..ఆమె తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. కిడ్నీ డోనార్‌ రోహిణి ఆచార్యతో పాటు ఆమె తండ్రి లాలూ ప్రసాద్‌ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ...మంగళవారం బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు..లాలూ యాదవ్ ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్ ని సందర్శించారు. తేజస్వి యాదవ్‌ను కలుసుకుని లాలూ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు , జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్ వంటి రాజకీయ మిత్రులు కూడా లాలూ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

Kejriwal : మామూలు విషయం కాదు..గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేజ్రీవాల్

తండ్రికి తన కిడ్నీ దానం చేసిన కూతురుగానే కాకుండా సమాజంలో బాధ్యత కలిగిన మహిళగా అందరికి ఆదర్శంగా నిలిచారు రోహిణి ఆచార్య(Rohini acharya). వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి తన కిడ్నీ (Kidney)దానం చేసి ప్రేమానురాగానికి చక్కని నిదర్శనమిచ్చిన రోహిణి ఆచార్య అందరికి ఆదర్శమే కాదు ఆమె చేసిన త్యాగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా(Social media)లో ప్రశంసిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు రోహి ఆచార్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సన్‌(Trending person)గా నిలిచారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోసం కూతురు రోహిణి ఆచార్య చేసిన త్యాగాన్ని భోజ్‌పూరి యాక్టర్ ఖేసరి లాల్‌యాదవ్ అభినందించారు. తండ్రికి కిడ్నీ దానం చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిందంటూ కితాబిచ్చారు.

బీజేపీ నాయకుడు, అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ సైతం రోహిణి ఆచార్య సేవను ప్రశంసించారు. రోహిణి తన తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. లాలూజీ దేశ్‌కి నేత అని ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియా ఫాలోవర్స్, ఆర్జేడీ నాయకులు రోహిణి ఆచార్య భేటీ బచావో భేటీ పడావో ప్రచారానికి ఉదాహరణగా నిలిచారంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలుపుతున్నారు.

First published:

Tags: Lalu Prasad Yadav, Pm modi, Tejashwi Yadav

ఉత్తమ కథలు