Home /News /national /

PM Modi: పండిట్ నెహ్రూకు ప్రధాని మోదీ నివాళి -చాచా బోధతో రాహుల్ ఇలా..

PM Modi: పండిట్ నెహ్రూకు ప్రధాని మోదీ నివాళి -చాచా బోధతో రాహుల్ ఇలా..

పండిట్ నెహ్రూకు ప్రధాని మోదీ నివాళి

పండిట్ నెహ్రూకు ప్రధాని మోదీ నివాళి

భారత తొలి ప్రధాని పండిట్ జవహరల్ లాల్ నెహ్రూ 132వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చాచాకు నివాళి అర్పించారు. ఢిల్లీలో నెహ్రూ స్మారకమైన శాంతివన్ వద్దకు పలువురు కీలక నేతలు నివాళి అర్పించారు. ‘మనకు కావలసింది శాంతి తరం’అన్న చాచా బోధను కోట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు..

ఇంకా చదవండి ...
భారత తొలి ప్రధాని పండిట్ జవహరల్ లాల్ నెహ్రూ 132వ జయంతి ఉత్సవాలు ఆదివారం నాడు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో నెహ్రూ స్మారకమైన శాంతివన్ వద్దకు పలువురు కీలక నేతలు నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా నెహ్రూ విగ్రహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ బాలల దినోత్సవం కూడా కావడంతో పిల్లల కోసం చాలా చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తొలి ప్రధాని నెహ్రూకు నివాళి అర్పించారు. ‘పండిట్ జవహర్‌లాల్ నెహ్రూజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’అంటూ మోదీ ఏకవాక్యంలో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ సీనియర్లతోకలిసి ఆదివారం ఉదయం శాంతివన్ కు చేరుకుని నెహ్రూ సమాధి వద్ద పూలు జల్లి నివాళి అర్పించారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన మునిమనవడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తిక ట్వీట్ చేశారు. ‘మనకు కావలసింది శాంతి తరం’అన్న చాచా బోధను కోట్ చేస్తూ, సత్యం, ఐక్యత, శాంతికి గొప్ప విలువనిచ్చిన భారతదేశపు మొదటి ప్రధానమంత్రిని స్మరించుకుంటున్నా’అని రాహుల్ పేర్కొన్నారు.

నెహ్రూ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కీలక అడుగు వేసింది. ఇప్పటిదాకా యూత్ కాంగ్రెస్, విమెన్ కాంగ్రెస్ లాంటి విభాగాలు ఉండగా, తొలిసారి బాల కాంగ్రెస్‌ పేరుతో 16-20 ఏళ్ల వయసు వారు సభ్యులుగా ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. నెహ్రూ జయంతి నాడే ఎంపీ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌ ఈ గ్రూపును ప్రారంభించారు. ఇది రాజకీయాలతో సంబంధం లేని గ్రూపని, ఈ బృంద సభ్యులకు కాంగ్రెస్‌ చరిత్రతో పాటు స్వాతంత్ర్యోద్యమం గురించి అవగాహన కల్పిస్తారని, వ్యక్తిత్వ వికాసం, వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారని నేతలు చెప్పారు.

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నెహ్రూ 132వ జయంతి. నెహ్రూకు పిల్లలన్నా.. రోజా పూలన్నా చాలా ఇష్టం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలిపేందుకు… నెహ్రూ జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరపాలని తీర్మానించగా… అప్పటి నుంచి నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Childrens day, Congress, Pm modi, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు