ప్రభుత్వాల కూల్చివేతపై ప్రధాని మోదీ (Pm Narendra Modi) పార్లమెంట్ లో కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే..ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా కూల్చివేసిందని అన్నారు. ఇందిరాగాంధీ 50 సార్లకుపైగా 356 ఆర్టికల్ పేరుతో ప్రభుత్వాలను పడగొట్టారు. కాంగ్రెస్ పాలకులు 356 ఆర్టికల్ ను దుర్వినియోగం చేశారని ప్రధాని మోదీ (Pm Narendra Modi) ఫైర్ అయ్యారు. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్ ప్రభుత్వాలను కాంగ్రెస్ పడగొట్టిందని ప్రధాని రాజ్యసభ వేదికగా నిప్పులు చెరిగారు. ఇక ప్రధాని ప్రసంగం అనంతరం రాజ్యసభ వాయిదా పడింది.
నిన్న లోక్ సభ, ఇవాళ రాజ్యసభ ప్రధాని మోదీ మాటలతో దద్దరిల్లాయి. విపక్షాలు ఆందోళన చేస్తున్నారన్న విషయం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిన్న లోక్ సభలో కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు చేసిన మోదీ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో దేశంలో అవినీతి రాజ్యమేలిందని తీవ్ర విమర్శలు చేశారు. వారి పాలనలో ప్రతి అవకాశాన్ని కూడా సంక్షోభంగా మార్చడమే యూపీఏ ట్రేడ్ మార్క్ అని ప్రధాని (Pm Narendra Modi) విమర్శించారు. 2G స్కామ్, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్కామ్ జరిగిందని మోదీ ఆరోపించారు. ఈడీ మాత్రమే ప్రతిపక్షాలన్నింటిని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చిందని..ఓటర్లు చేయలేనిది చేసిందని ప్రధాని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న 2004-2014 కాలాన్ని కోల్పోయిన దశాబ్ది అని ప్రధాని (Pm Narendra Modi) అన్నారు.
ఇక మన దేశంలోనే మొబైల్ డేటా ఛార్జీలు తక్కువగా వున్నాయని ప్రధాని అన్నారు. మా హయాంలో ఏకంగా 70 ఎయిర్ పోర్టులు కట్టినట్లు మోదీ గుర్తు చేశారు. 2020 నుంచి 2030 వరకు 'ఇండియా డికేడ్' గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు. నాలుగు వరసల రోడ్లను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాం. మౌళిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు నెగెటివిటీని నమ్మడం లేదని, ప్రతిపక్షాలు పునరాలోచించుకోవాలని తెలిపారు.
ఇవాళ విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగం కొనసాగింది. అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విపక్షాలు మోదీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో ప్రధాని మోదీ (PM Modi) విపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. విపక్షాల తీరు చూస్తుంటే బాధగా ఉంది. దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసింది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ హయాంలో పాలన శుద్ధ దండగ అని ప్రధాని విమర్శలు గుప్పించారు. నేను కాంగ్రెస్ పాలనను నిశితంగా పరిశీలించాను.
మేము వికాసాన్ని నమ్ముతాం. కానీ విపక్షాన్ని కాదని ప్రధాని మోదీ రాజ్యసభలో అన్నారు. మేము దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతాం. 18 వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చి వెలుగులు నింపినం. మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుంది. కొంతమంది ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం గుంతలను మాత్రమే తవ్వింది. మేము దేశ ప్రగతి కోసం నిత్యం శ్రమిస్తున్నాం. సాంకేతిక సాయంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం. మేము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తాం అని ప్రధాని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, PM Narendra Modi, Rajyasabha