హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కుమార్తె పెళ్లికి తనను ఆహ్వానించిన రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్

కుమార్తె పెళ్లికి తనను ఆహ్వానించిన రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్

ప్రధాని మోదీ (Image: DDNews)

ప్రధాని మోదీ (Image: DDNews)

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ మంగల్ కేవత్‌ను పార్టీ సభ్యత్వం ఇచ్చారు.

  తన సొంత నియోజకవర్గం వారణాసిలో రిక్షా తొక్కుతూ జీవితం గడుపుతున్న ఓ రిక్షా కార్మికుడికి (Rickshaw puller) సర్‌ప్రైజ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). తన కుమార్తె పెళ్లికి రావాలంటూ ఆ రిక్షా కార్మికుడు పంపిన ఆహ్వానానికి ప్రత్యుత్తరం ఇచ్చి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. కొత్త జంటకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ, తనను ఆహ్వానించిన రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ ప్రత్యుత్తరం రాశారు. ఆ లేఖ గురువారం నాడు రిక్షాకార్మికుడికి చేరింది. కొత్త జంటను, ఆ కుటుంబాన్ని దీవిస్తూ ప్రధాని మోదీ అందులో తన ఆశీస్సులు తెలియజేశారు.

  రిక్షా కార్మికుడు మంగల్ కేవత్ (Image Credit: Twitter)

  వారణాసికి చెందిన మంగల్ కేవత్ అనే రిక్షా కార్మికుడు తన కుమార్తె పెళ్లికి రావాలంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానపత్రిక పంపాడు. అయితే, ఏదో తన తృప్తి కోసం రాశానని అనుకున్నాడు. అంత పెద్ద మనుషులు తన ఇంటి పెళ్లికి వస్తారా? అయినా తన ఆహ్వానపత్రిక ప్రధాని వద్దకు చేరి ఉంటుందా? అని సంకోచించాడు. అయితే, తాజాగా ప్రధాని మోదీ నుంచి సమాధానం రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

  కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ

  2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు ప్రధానమంత్రి మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. తన నియోజకవర్గంలోని డోమ్రి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. మంగల్ కామత్ ఆ గ్రామానికి చెందిన వ్యక్తి. ‘నా స్నేహితులు కొందరు నా కుమార్తె పెళ్లి ఆహ్వానపత్రికను ప్రధాని మోదీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఓ పత్రికను ఢిల్లీకి, మరో పత్రికను వారణాసిలోని కార్యాలయానికి పంపా. కానీ, సమాధానం వస్తుందని ఊహించలేదు. ఆ పెళ్లికి ప్రధాని రాకపోయి ఉండొచ్చు. కానీ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ రాసిన లేఖను చూపించా.’ అని ఆనందం వ్యక్తం చేశాడు కేవత్.

  PM Modi in Varanasi, PM Modi, Kashi Vishwanath, Varanasi, PM Modi car, PM Modi Land Rover Range Rover Vogue, Land Rover Range Rover Vogue SE, Lok Sabha Elections 2019, lok sabha election results, పీఎం మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ మోదీ, కాశీ విశ్వనాథ్, పీఎం మోదీ కార్, పీఎం మోదీ వాహనం, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఎల్‌డబ్ల్యూబీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
  వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన (Image: PTI)

  బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ మంగల్ కేవత్‌ను పార్టీ సభ్యత్వం ఇచ్చారు. అలాగే, గంగా నది భక్తుడైన ఈ రిక్షా కార్మికుడు తనకు వచ్చిన ఆదాయంలో కొంత గంగా ప్రక్షాళన కోసం ఖర్చుపెట్టడం విశేషం. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో కూడా అతడు క్రియాశీలకంగా పాల్గొంటాడు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Pm modi, Varanasi

  ఉత్తమ కథలు