PM Modi Security Lapse | ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జనవరి 5న పంజాబ్‌లో పర్యటించనున్నారనే దానికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే భద్రపరచాలని పంజాబ్ (Punjab) ప్రభుత్వాన్ని.. హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జనవరి 5న పంజాబ్PM Modi Security Lapse: ప్రధాని పర్యటన రికార్డులను భద్రపరచాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశంలో పర్యటించనున్నారనే దానికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే భద్రపరచాలని పంజాబ్ (Punjab) ప్రభుత్వాన్ని.. హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో రిజిస్ట్రార్ జనరల్‌కు సహకరించాలని, అవసరమైన సహాయం అందించాలని పోలీసు అధికారులు, SPG, ఇతర కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీలతో సహా పంజాబ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం, చండీగఢ్ యూనియన్ టెరిటరీ డైరెక్టర్ జనరల్‌తోపాటు ఒక NIA అధికారి రికార్డులను సేకరించడంలో రిజిస్ట్రార్ జనరల్ (RG)కి సహాయం చేస్తారని తెలిపింది.
WHO: ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదు అనేది అవాస్తవం.. జాగ్రత్త తప్పని సరి: డబ్ల్యూహెచ్ఓ
అన్ని రికార్డులను తన వద్ద ఉంచుకోవాలని RGని కోరింది. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా చర్యల్లో జరిగిన లోపాలపై కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి జనవరి 10న మరోసారి విచారించే వరకు తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీకి చెందిన హక్కుల సంఘం "లాయర్స్ వాయిస్" వేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణకు కమిటీ ఏర్పాటైంది. ప్రధాని భద్రతలో లోపానికి సంబంధించి కేంద్రం విచారణ జరుపుతుంది. ఇందుకోసం హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రధాని భద్రతలో లోపాన్ని ముగ్గురు సభ్యుల కమిటీ విచారించనుంది. త్రిసభ్య కమిటికి కేబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వం వహిస్తారు. ఐబి జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పిజి ఐజి ఎస్ సురేష్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా హోంశాఖకు నివేదికను సమర్పించనుంది.
ఏం జరిగింది..
పంజాబ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. బుధవారం ఫిరోజ్పూర్లో కొందరు ఆందోళనకారులు ప్రధాని నరేంద్రమోదీ వెళ్లాల్సిన రహదారిలో ఆయనను అడ్డుకున్నారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయింది. ఈ ఘటన తర్వాత ప్రధాని మోదీ ఏ కార్యక్రమానికి హాజరుకాకుండా ఢిల్లీకి తిరిగి వచ్చారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.