నేనున్నా.. అస్సాం ప్రజలకు ప్రధాని మోదీ అభయం..

గురువారం ట్విట్టర్ వేదికగా అస్సాం ప్రజలకు ప్రధాని మోదీ అభయాన్ని ప్రసాదించారు. ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో ట్వీట్లు చేసిన మోదీ.. తాను ఉన్నానంటూ హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: December 12, 2019, 12:17 PM IST
నేనున్నా.. అస్సాం ప్రజలకు ప్రధాని మోదీ అభయం..
ప్రధాని మోదీ (ఫైల్)
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అసోం, త్రిపురలో పెద్ద ఎత్తున ఆందోళన, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ బిల్లు వల్ల తమ హక్కులు హరించుకుపోతాయంటూ అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో.. వారికి ప్రధాని నరేంద్ర మోదీ హామీనిచ్చారు. నేనున్నానంటూ అభయం ఇచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో ట్వీట్లు చేసిన మోదీ.. ‘నేను, భారత ప్రభుత్వం మీ హక్కులకు హామీగా ఉంటాం. రాజ్యాంగం ప్రసాదించిన రాజకీయ, సాంస్కృతిక, భాషా, భూ హక్కులను పరిరక్షిస్తాం. అందుకు నాదీ హామీ. పౌరసత్వ బిల్లుతో నా అస్సామీ సోదరులు, సోదరీమణులు దయచేసి ఆందోళన చెందవద్దు.’ అని ట్వీట్ చేశారు.

కాగా, భారత్‌కు పొరుగున ఉన్న దేశాల్లో మతపరమైన దాడికి గురై, భారత్‌లో ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసందే. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో స్వయంగా ప్రధానియే ట్వీట్ చేసి అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>