హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: బీజేపీకి ప్రజల మద్దతు అసాధారణం.. నూతన ఆకాంక్షలకు ప్రతిబింభమన్న ప్రధాని మోదీ

PM Modi: బీజేపీకి ప్రజల మద్దతు అసాధారణం.. నూతన ఆకాంక్షలకు ప్రతిబింభమన్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

PM Modi: దేశంలో బీజేపీకి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఉన్న భావనను వ్యక్తం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ ప్రజల నుంచి బీజేపీ లభిస్తున్న మద్దతు సామాన్యమైనది కాదని.. ఇది నూతన భారత ఆకాంక్షలకు ప్రతిబింభమని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో పాల్గొన్న ప్రధాని(PM Modi).. రాబోయే 25 ఏళ్లు పూర్తిగా అభివృద్ధికి సంబంధించినదని వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీకి(BJP) ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఉన్న భావనను వ్యక్తం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. తాము కేవలం ఐదేళ్ల కోసం అభివృద్ధి ప్రణాళిక వేయడం లేదని అన్నారు. తాము దూరదృష్టితో పరిపాలన సాగిస్తున్నామని అన్నారు. దేశంలో సాగుతున్న పరిపాలన కారణంగా పేదల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. షార్ట్ కట్‌తో అధికారంలోకి వచ్చే వారి కారణంగా ఏ జరుగుతుందన్నది ప్రజలకు అర్థమైందని.. అందుకే ప్రజలు వారికి అధికారం ఇవ్వడం లేదని అన్నారు.

దేశం కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీ వైపు చూస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వారిని దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలను దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు. గుజరాత్(Gujarat) ప్రజలు రికార్డులు బద్దలు కొట్టడంలో కూడా రికార్డు సృష్టించారని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ చరిత్రలో బీజేపీకి అతి పెద్ద మ్యాండేట్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. కుల, వర్గ, వర్గాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేశారు. ఇప్పుడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మొదటి ఎంపిక బీజేపీ అయ్యిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన మెజార్టీ స్థానాలను భారీ మెజార్టీతో బీజేపీ గెలుచుకుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ ప్రజలు బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు. అక్కడ గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య ఓట్ల శాతం తేడా ఒక శాతం కంటే తక్కువగానే ఉందని గుర్తు చేశారు.

AAP: జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..నెరవేరిన కేజ్రీవాల్ కల

Gujarat Election Result | Himachal Pradesh Election Result: గుజరాత్, హిమాచల్ ఎన్నికల తుది ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

అయినా హిమాచల్ ప్రదేశ్‌ను(Himachal Pradesh) అభివృద్ధి చేసేందుకు తాము వంద శాతం ప్రయత్నిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివాసీల ఆకాంక్షలు నెరవేర్చేది కూడా బీజేపీనే అని.. దేశ తొలి ఆదివాసి రాష్ట్రపతి బీజేపీ ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు. గుజరాత్‌లోని అనేక మంది యువత ఇప్పటివరకు కాంగ్రెస్ పరిపాలన చూడలేదని.. ఎప్పుడు ప్రశ్నించేతత్వం ఉన్న యువ ఓటర్లు కూడా బీజేపీకి ఓటు వేయడం మామూలు విషయం కాదన అన్నారు. వారి విశ్వాసం కూడా బీజేపీ గెలుచుకోవడం సంతోషం కలిగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

First published:

Tags: Bjp, Gujarat Assembly Elections 2022, Pm modi

ఉత్తమ కథలు