PM Modi: ఆ సంస్కరణలు పెట్టుబడిదారులకు గొప్ప సంకేతాన్ని పంపాయి.. ప్రధాని నరేంద్ర మోదీ

"వ్యాట్‌ను సీఎస్టీగా మార్చినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రాలకు ఏదైనా ఆదాయ లోటు ఏర్పడితే భర్తీ చేస్తామని తెలిపింది. కానీ యూపీఏ ఆ హామీని నిలబెట్టుకోలేదు" అని మోదీ తెలిపారు.

news18-telugu
Updated: October 29, 2020, 10:29 AM IST
PM Modi: ఆ సంస్కరణలు పెట్టుబడిదారులకు గొప్ప సంకేతాన్ని పంపాయి.. ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
  • Share this:
"ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. కానీ ఇది సంబర పడాల్సిన సమయం కాదు. మన సంకల్పాన్ని, మన ప్రవర్తనను, మన వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలి. పరిస్థితులను అధిగమించడంపై దృష్టి సారించడంలో భాగంగా ప్రజల్లో మరింత అవగాహన, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలి" అని భావిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. మంచి జరుగుతందని ఆశిద్దాం.. కానీ గడ్డు కాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను చాలా ముందుగా విధించడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడంపై చాలా ధీమాతో ఉన్పట్టు చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాజాగా ఎకానమిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ విషయాలను వెల్లడించారు. అలాగే తనపై విమర్శలు చేసేవారికి ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు.

"వ్యవసాయ, కార్మిక రంగాల్లో దూరదృష్టితో తీసుకొచ్చిన సంస్కరణలు.. విస్తృత పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు గొప్ప సంకేతాన్ని పంపాయి. దేశంలోని కార్మిక చట్టాలు కార్మికులకు తప్ప అందరికీ ఉపయోగపడతాయనే ఒక జోక్ ఉంది. కానీ కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులకు, సంస్థలకు మేలు చేకూర్చేలా ఉంటాయి. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఉత్పాదక, వ్యవసాయ రంగాలో వ‌ృద్దిరేటు, రాబడిని పెంచడానికి సాయపడతాయని నాకు నమ్మకం ఉంది. అవి మార్కెట్, మార్కెట్ శక్తులను నమ్మే కొత్త ఇండియాను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

వ్యాట్‌ను సీఎస్టీగా మార్చినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రాలకు ఏదైనా ఆదాయ లోటు ఏర్పడితే భర్తీ చేస్తామని తెలిపింది. కానీ యూపీఏ ఆ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రాలకు ఆదాయం లోటు చెల్లించడానికి వాళ్లు నిరాకరించారు. ఒక్క ఏడాది మాత్రమే ఐదేళ్లు ఇలానే చేశాడు. అందుకోసమే రాష్ట్రాలు యూపీఏ హయాంలో జీఎస్టీకి అంగీకరించలేదు. మేము 2014లో అధికారంలో వచ్చాక వాటిని క్లియర్ చేశాం. ఇది మా సమాఖ్య విధానాన్ని సూచిస్తుంది.

మేము ఆర్థిక పునరుద్ధరణ దిశగా ముందుకెళుతున్నాం. సూచీలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేను ముందుగా చెప్పినట్టుగానే రైతులు అన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టారు. మేము కూడ అత్యధిక మద్ధతు ధరతో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టాం. రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ఆదాయాన్ని ఇవ్వబోతున్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు రావడం.. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా భారత్ ఇమేజ్ పెరగడాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ.. ఏప్రిల్-ఆగస్టు కాలానికి 35.73 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్‌డీఐల కన్నా ఇది 13 శాతం ఎక్కువ. ఆటో రంగంలో అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక, ఉత్పాదక రంగంలో స్థిరమైన రికవరీ రేటు సాధించడం ద్వారా సెప్టెంబర్‌లో అభివృద్ది చెందుతున్న మార్కెట్ల జాబితాలో చైనా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచేలా చేసింది. ఈ-వే బిల్స్, జీఎస్టీ కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త చందదారుల సంఖ్య జూలైతో పోలిస్తే.. ఆగస్టులో 34 శాతం పెరిగింది. ఇది జాబ్‌ మార్కెట్ పుంజుకుంటుందనడానికి ఇది సంకేతం. ఇవే కాకుండా విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరకున్నాయి.

ఆత్మ నిర్భర భారత్ ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు, అనధికార రంగానికి పెద్ద మేలు చేకూర్చింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన రికవరీకి, వృద్ధికి చోదక శక్తిగా మారతాయని నేను భావిస్తున్నాను. మూడీస్ ప్రకారం.. 2020లో 154 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాయి. ఆ సమయంలో చైనాకు కేవలం 86 మాత్రమే వెళ్లాయి. భారతదేశ వృద్దిపై ప్రపంచం పెట్టుకున్న విశ్వాసానికి ఇది స్పష్టమైన సూచికగా నిలుస్తుంది. భారతదేశాన్ని అగ్రశ్రేణి ఉత్పాదక గమ్యస్థానంగా మార్చేందుకు మేము బలమైన పునాదులు వేశాం" అని మోదీ తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: October 29, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading