Home /News /national /

PM MODI SAYS INDIA SHOWS ITS STRENGTH ON FIGHTING WITH COVID 19 PANDEMIC AK

PM Modi: కరోనాపై పోరాటంలో భారత్ శక్తిని చూపించాం.. అంతర్జాతీయ వేదికలో ప్రధాని మోదీ వ్యాఖ్య

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

PM Modi Speech: కరోనా కాలంలో ప్రపంచదేశాలకు మందులు పంపడం ద్వారా మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిన ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనే భారత్ దృష్టిని తాము చూశామని ప్రధాని మోదీ తెలిపారు.

    కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడడం ద్వారా భారత్ తన శక్తిని ప్రదర్శించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ అజెండాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రత్యేక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లను ప్రధాని మోదీ ప్రస్తావించారు. కేవలం ఒక సంవత్సరంలో భారత్ 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించిందని వ్యాఖ్యానించారు. భారత్ వంటి ప్రజాస్వామ్యం యావత్ ప్రపంచానికి ఆశల పుష్పగుచ్ఛాన్ని అందించిందని గుర్తు చేశారు. భారత్ ప్రపంచ ఆకాంక్షలను నెరవేరుస్తామని తాను అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో 80 కోట్ల మందికి పైగా దేశ పౌరులకు ఉచిత ఆహారాన్ని అందించడం ద్వారా భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని అన్నారు.

    కరోనా కాలంలో ప్రపంచదేశాలకు మందులు పంపడం ద్వారా మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిన ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనే భారత్ దృష్టిని తాము చూశామని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారు అని.. వైద్యులు తమ సానుభూతితో అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటున్న దేశం ఇది అని వ్యాఖ్యానించారు. భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని ప్రోత్సహిస్తోందని.. ఐటీ రంగం రాత్రింబవళ్లు పనిచేసిందని చెప్పుకొచ్చారు. భారత్ రికార్డు స్థాయిలో సాఫ్ట్‌వేర్ నిపుణులను అందిస్తోందని అన్నారు.

    భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే ఉత్తమ సమయమని ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు సూచించారు. భారత్‌లో 2021లో 60,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం భారత్ విధానాలు రూపొందిస్తోందని.. వర్తమానంతో పాటు రాబోయే 25 సంవత్సరాల లక్ష్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ అధిక వృద్ధి, సంక్షేమం, సంతృప్త లక్ష్యాలను నిర్దేశించిందని తెలిపారు. దేశం డిజిటల్ ఇన్‌ఫ్రా ఎంతో గొప్పదని ప్రధాని కీర్తించారు. ఆరోగ్య సేతు యాప్, కోవిన్ పోర్టల్ భారతదేశానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు.

    PM Modi Security Breach : ఎంక్వైరీ కమిటీ హెడ్ జస్టిస్ ఇందూ మల్హోత్రాకు బెదిరింపులు.. లాయర్లకు కూడా

    S-400: భారత్‌పై ఆంక్షలకు అమెరికా వెనుకడుగు.. చైనాకు చెక్ పెట్టాలంటే తప్పదుగా!

    దేశంలో వ్యాపారాలకు ఎదురయ్యే సవాళ్లను తాము అర్థం చేసుకున్నామని.. వాటిని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 10. 6 లక్షలకు పైగా గ్రామాలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించబడ్డాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు, ప్రముఖ పరిశ్రమ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం కూడా పాల్గొంటోంది. ఈ వేదికలోజపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సువా వాన్ డెర్ లేయన్ కూడా ప్రసంగిస్తారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు