Home /News /national /

PM MODI SAYS INDIA IS PLANNING SPECIAL AYUSH VISAS FOR FOREIGN NATIONALS PVN

PM Modi : ఇకపై వారికి ప్రత్యేక వీసాలు.. వాటన్నింటిపై ఆ ముద్ర..మోదీ కీలక ప్రకటన

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

AYUSH Investment And Innovation Summit : కొవిడ్ టైమ్ లో ఆయుర్వేద మెడిసిన్ పంపిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు మారిషస్ ప్రధాని. భారత్ ఫార్మీసీ హబ్ అని అన్నారు. ఇక, గాంధీ జన్మస్థలానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఆరోగ్య సంస్థ అదినేత టెడ్రస్ అథనామ్. దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో పాటు ప్రభుత్వ మద్దతు సంప్రదాయ ఔషధ రంగంలో ఆవిష్కరణలకు కీలకమన్నారు.

ఇంకా చదవండి ...
PM Modi About Ayush Visas : గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో మహాత్మా మందిర్​ లో మూడు రోజుల పాటు జరిగే "గ్లోబల్ ఆయుష్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ ఇన్నోవేషన్​" కార్యక్రమాన్ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రస్ అథనామ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఆయుష్ రంగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే తొలిసారన్నారు. మెడికల్ ప్లాంట్ల అమ్మకాల కోసం మార్కెట్లతో రైతులు ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఆయుష్ ఈ-మార్కెట్ ప్లేస్ ఆధునికీకరణ, విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. భారత్ ​లో త్వరలో ఆయుష్​ గుర్తు(AYUSH MARK)ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ఆయుష్ గుర్తు ఉంటుందని మోదీ చెప్పారు. ఇది దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను ఇస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు ఈ మార్క్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రపంచ దేశాల ప్రజలకు కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా..సంప్రదాయ ట్రీట్మెంట్స్ కోసం భారత్​ కు వచ్చే విదేశీయులకు ఆయుష్ వీసా(AYUSH VISA) పేరుతో ప్రత్యేక కేటగిరీ వీసాలు మంజూరు చేయనున్నట్లు మోదీ చెప్పారు.

ALSO READ LOC : డ్రాగన్ వంకరబుద్ది...భారత సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్లు

మరోవైపు, కొవిడ్ టైమ్ లో ఆయుర్వేద మెడిసిన్ పంపిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు మారిషస్ ప్రధాని. భారత్ ఫార్మీసీ హబ్ అని అన్నారు. ఇక, గాంధీ జన్మస్థలానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఆరోగ్య సంస్థ అదినేత టెడ్రస్ అథనామ్. దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో పాటు ప్రభుత్వ మద్దతు సంప్రదాయ ఔషధ రంగంలో ఆవిష్కరణలకు కీలకమన్నారు. ఆవిష్కర్తలు, పరిశ్రమ, ప్రభుత్వం సుస్థిరంగా, పర్యావరణపరంగా సున్నితంగా సంప్రదాయ ఔషధాలను అభివృద్ధి చేయాలని టెడ్రస్ అథనామ్ అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Ayushman Bharat, Ayushman Bharat Health Scheme, Pm modi, Visa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు