హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: సంస్కరణలతోనే స్వేచ్ఛకు అవకాశం: ప్రధాని మోదీ

PM Modi: సంస్కరణలతోనే స్వేచ్ఛకు అవకాశం: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)

తమిళనాడులోని ప్రీమియర్‌ టెక్నికల్‌ వర్సిటీ అయిన అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో శుక్రవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాలివే..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam | Vijayawada | Visakhapatnam

బలమైన ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరినీ నియంత్రించడం కాదని ప్రధాని మోదీ చెప్పారు. బలమైన ప్రభుత్వం అంటే ఉన్న భావనను భాజపా ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు. కేంద్రం కొత్త మార్గాలను తెరిచి, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించిందని, సెక్టోరియల్‌ రీఫార్మ్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. తమిళనాడులోని ప్రీమియర్‌ టెక్నికల్‌ వర్సిటీ అయిన అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో శుక్రవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బలమైన ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ, ప్రతి అంశాన్ని నియంత్రించదు. ఇది జోక్యం చేసుకునే వ్యవస్థను నియంత్రిస్తుంది. బలమైన ప్రభుత్వం రెస్ట్రిక్ట్‌ చేయదు, రెస్పాన్సివ్‌గా ఉంటుంది.’ అని చెప్పారు.

‘బలమైన ప్రభుత్వం ప్రతి డొమైన్‌లోకి వెళ్లదు. అది తనను తాను పరిమితం చేసుకుంటుంది. ప్రజల ప్రతిభకు చోటు కల్పిస్తుంది. బలమైన ప్రభుత్వ బలం తనకు ప్రతిదీ తెలియదని, అన్నీ చేయలేమని అంగీకరించే వినయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రజలు ప్రతి రంగంలో సంస్కరణలను చూస్తున్నారు. ప్రజలకు, స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం కల్పించాం. దాదాపు 25,000 ఒప్పందాలను రద్దు చేయడం వల్ల జీవన సౌలభ్యం పెరుగుతోంది. ఏంజెల్ ట్యాక్స్, రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ తొలగింపు, కార్పొరేట్ ట్యాక్స్‌ తగ్గింపు ద్వారా పరిశ్రమలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  మీకు చుండ్రు పెద్ద సమస్యగా మారిందా..? అయితే, ఈ ఆయిల్ ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ గ్యారెంటీ..!


* అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌

డ్రోన్లు, అంతరిక్షం, జియో-స్పేషియల్ రంగాలలో సంస్కరణలు కొత్త మార్గాలను తెరుస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో ఉన్నవారు స్పీడ్‌, స్కేల్‌తో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీపై అభిరుచి, రిస్క్ తీసుకునేవారిపై నమ్మకం ఉన్నాయని, ఈ అంశాలన్నీ అవకాశాలను సృష్టించే, నిలకడగా, అభివృద్ధి చేసే వేదికను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి శతాబ్దంలో ఒకసారి వచ్చే సంక్షోభంలాంటిదని, దేశంలోని శాస్త్రవేత్తలు, సాధారణ ప్రజల కరోనాను దీటుగా ఎదుర్కొన్నారని, మహమ్మారి ప్రతి దేశాన్ని పరీక్షించిందని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొన్న శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, నిపుణులు, సామాన్య ప్రజలకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఫలితంగానే నేడు భారతదేశంలోని ప్రతి రంగం కొత్త జీవితంతో దూసుకుపోతోందని తెలిపారు. పరిశ్రమ, ఆవిష్కరణ, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో, భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు.

‘ఇన్నోవేషన్ అనేది జీవన విధానంగా మారుతోంది. కేవలం గత ఆరేళ్లలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 15,000 శాతం పెరిగింది. 2016లో కేవలం 470గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య ఇప్పుడు దాదాపు 73,000కి చేరుకుంది. పరిశ్రమలు, ఆవిష్కరణలు బాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి. గత సంవత్సరం, భారతదేశం రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది’ అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్య డైనమిక్స్‌లో, భారతదేశం స్థానం ఎప్పుడూ అత్యుత్తమంగా ఉందని, దేశం అత్యధికంగా వస్తు సేవల ఎగుమతులను నమోదు చేసిందని మోదీ వివరించారు.

* సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రలకు మోదీ అభినందనలు

ప్రపంచానికి కీలక సమయంలో ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేశామని మోదీ చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా మధ్య భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడంపై, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం 'ముఖ్యమైన లింక్'గా మారుతోందన్నారు. వర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌ సేవలను మోదీ అభినందించారు. రేపటి నాయకులైన విద్యార్థులను సృష్టిస్తున్న దేశ నిర్మాతలని కొనియాడారు. పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను కూడా అభినందించారు.

ఈ సందర్భంగా 100 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద చెప్పిన మాటలను మోదీ గుర్తుచేసుకున్నారు. సమస్యలను పరిష్కరించేవారుగా యువతరంపై నమ్మకం ఉంచాలనే మాటలు నేటి తరానికీ సరిపోతాయని చెప్పారు. ఇప్పుడు దేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం భారతీయ యువత వైపు చూస్తోందని తెలిపారు. గొప్ప ఇంజినీర్‌లను ప్రపంచానికి దేశం అందిస్తోందని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాలనో రాష్ట్రంలో విద్యా వాతావరణాన్ని మోదీ కొనియాడారు. ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తుల సంఖ్యను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు.

* ఏడాదిలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడో ర్యాంక్‌

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. ఇల్లం తేడి కల్వి(ఇంటింటికీ విద్య), పిల్లలకు అల్పాహారం అందించే పథకం వంటి విద్యకార్యక్రమాలను వివరించారు. తన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ఆసక్తి కనబరిచిందపి, కేవలం ఒక సంవత్సరంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం 14వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరిందన్నారు. చాలా మంది పెట్టుబడిదారులు తమిళనాడు వైపు చూస్తున్నారని తెలిపారు.

* తరగతి గదులకు వెళ్లిన మోదీ

తమిళులు చారిత్రాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారని, అది కళ్లనై(కరికల్ చోళన్ రాళ్లతో చేసిన ఆనకట్ట), తంజావూరు పెద్ద దేవాలయం చూస్తే అర్థమవుతుందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్నారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్‌లకు పూర్తి చేసిన దాదాపు 3.68 లక్షల మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

అనంతరం, వేడుక ముగిసిన తర్వాత, ప్రధాన మంత్రి స్థల సమస్య కారణంగా ప్రధాన వేదిక వద్దకు రాలేకపోయిన గ్రాడ్యుయేషన్ విద్యార్థులను కలుసుకునేందుకు అన్నా యూనివర్సిటీలోని కొన్ని తరగతి గదులకు వెళ్లారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేసిన వీడియోలో, మోదీ విద్యార్థుల వైపు చేతులు ఊపుతూ కనిపించారు. కొత్త గ్రాడ్యుయేట్లకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Published by:Mahesh
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, MK Stalin, Pm modi, Tamilnadu, University

ఉత్తమ కథలు