రూ.150 నాణేన్ని విడుదల చేసిన మోదీ.. గాంధీ 150వ జయంతి వేళ..

గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో ఈ నాణేన్ని విడుదల చేశారు ప్రధాని.

news18-telugu
Updated: October 2, 2019, 8:42 PM IST
రూ.150 నాణేన్ని విడుదల చేసిన మోదీ.. గాంధీ 150వ జయంతి వేళ..
రూ.150 నాణెం విడుదల చేసిన మోదీ
  • Share this:
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణేన్ని విడుదల చేశారు ప్రధాని. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గాంధీ జయంతిని యావత్ ప్రపంచం జరుపుకుంటోందన్నారు ప్రధాని మోదీ. మహాత్ముడి జయంతికి స్మారకంగా ఐక్యరాజ్య సమితి పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు స్మారక స్టాంపులు, నాణేలను కూడా విడుదలు చేస్తున్నామన్నారు ప్రధాని.



అంతకముందు మోదీ గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన వస్తువులు, ఆయన నడియాడిన నేలను సందర్శించి.. దేశానికి మహాత్ముడు చేసిన సేవను గుర్తు చేసుకున్నారు మోదీ. ఇక సబర్మతి ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు ప్రధాని మోదీ. 'గాంధీ 150వ జయంతి వేళ, ఆయన స్వచ్ఛ భారత్ కల సాకారమైనందుకు నాకు సంతృప్తిగా ఉంది. దేశం బహిరంగ మలవిసర్జన రహితంగా మారిన సమయంలో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ జయంతి వేడుకలకు హాజరవడం నా అదృష్టంగా భావిస్తున్నా.'' అని విజిటర్స్ బుక్‌లోపేర్కొన్నారు.

విజిటర్స్ బుక్‌లో మోదీ సందేశం
Published by: Shiva Kumar Addula
First published: October 2, 2019, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading