భారత్ చేరుకున్న సౌదీ యువరాజు...ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌లో అడుగుపెట్టారు.  ఆయన రాకతో..ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనపెట్టేసిన..ప్రధాని మోదీ స్వయంగా డీల్లీ విమానాశ్రయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి సౌదీ యువరాజుకు ఘన స్వాగతం పలికారు.

Suresh Rachamalla | news18-telugu
Updated: February 20, 2019, 11:32 AM IST
భారత్ చేరుకున్న సౌదీ యువరాజు...ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ
భారత్ చేరుకున్న సౌదీ యువరాజు.
  • Share this:
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌  భారత్‌లో అడుగుపెట్టారు.  ఆయన రాకతో... ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనపెట్టేసిన.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి సౌదీ యువరాజుకు ఘన స్వాగతం పలికారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వెంట సౌదీ మంత్రులు, ఇతర ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పర్యటనలో భాగంగా డీల్లీ చేరుకున్నారు.  ఈ పర్యటనలో ముఖ్యంగా.. ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మధ్య  ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే.. అంతకుముందు పాకిస్థాన్‌ పర్యటన ముగించుకున్న మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. రియాద్‌ వెళ్లి తిరిగి భారత్‌ వచ్చారు. పాక్‌ పర్యటన నుంచి నేరుగా భారత్‌ రావడంపై  అధికారులు అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది.


Published by: Suresh Rachamalla
First published: February 20, 2019, 4:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading