PM MODI RECEIVES FIRST LATA DEENANATH MANGESHKAR AWARD PVN
PM Modi : నిస్వార్థ సేవ..మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు..దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాని
అవార్డు అందుకుంటున్న మోదీ
PM Modi Recives Lata Mangeshkar Award : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీ..లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకున్నారు.
Deenanath Mangeshkar Award : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీ..లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు(Lata Deenanath Mangeshkar Award)ను అందుకున్నారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం..లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ముంబైకి వచ్చారు. ముంబైలోని షణ్ముకానంద హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీకి..లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి అవార్డును అందజేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు లతా మంగేష్కర్(Lata Mangeshkar) చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మోదీ. తనకు దక్కిన ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకుంటూ ప్రధాని మోదీ లతా మంగేష్కర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అవార్డును అందుకున్న తర్వాత కొంతసేపు ఉద్వేగానికి లోనయ్యారు మోదీ.
మోదీ మాట్లాడుతూ.."లతా దీదీ లాంటి సోదరి పేరుపై అవార్డు వస్తే అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. కాబట్టి అంగీకరించకపోవడానికి నాకు సాధ్యం కాదు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితమిస్తున్నాను. లతా దీదీ నాకు పెద్ద అక్కలాంటి వారు. ఆమె మాతా సరస్వతి దేవికి ప్రతిరూపం. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుంది. లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేది. చాలా దశాబ్దాల తర్వాత ఆమె లేకుండా తొలిసారి రాఖీ పౌర్ణమి జరుపుకోవాల్సి వస్తోంది" అని అన్నారు. కాగా,దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని లతా మంగేష్కర్ కుటుంబం,మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. సినిమా రంగంలో చేసిన సేవలకుగానూ ప్రముఖ నటులు ఆశా పరేఖ్, జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. భారతీయ సంగీతానికి గానూ రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా, ఉత్తమ నాటక అవార్డు సంజయ్ ఛాయాకు లభించింది. కాగా,లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో అస్వస్థతతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.