Home /News /national /

PM MODI REACTES ON FINANCE MINISTER ANNOUNCEMENT ON CUTS EXCISE DUTY ON FUELS RS 200 SUBSIDY TO PM UJJWALA BENEFICIARIES PVN

PM Modi : మాకు ప్రజలే ఫస్ట్..ఇవాళ కేంద్రం వరుస శుభవార్తలపై మోదీ

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi On Oil Prices Reduce : ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వరుస శుభవార్తలు చెప్పింది.పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే మరో కీలక ప్రకటన కూడా చేశారు.

ఇంకా చదవండి ...
PM Modi On Oil Prices Reduce : ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వరుస శుభవార్తలు చెప్పింది.పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే మరో కీలక ప్రకటన కూడా చేశారు. ప్లాస్టిక్,సిమెంట్,ముడి పదార్థాలపై సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దిగుమతిపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్​ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్​ డ్యూటీని తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని ద్వారా తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. వాటితో పాటు ఇనుము, స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. సిమెంట్​ను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ధరలు తగ్గేందుకు మెరుగైన రవాణా వ్యవస్థలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

మరోవైపు,గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను రూ.200 త‌గ్గిస్తూ పెద్ద నిర్ణ‌యం తీసుకొంది.కేంద్రం అయితే ఇది కొంద‌రికి మాత్ర‌మే అని ష‌ర‌తులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందిస్తామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇది దేశంలోనే ఎందరో మ‌హిళ‌ల‌కు సాయం చేస్తుంద‌ని ఆమె అన్నారు.

కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మోదీ..మాకు ఎల్లప్పుడూ ప్రజలే ఫస్ట్ అని పేర్కొన్నారు. నేటి నిర్ణయాలు, ముఖ్యంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలలో గణనీయమైన తగ్గుదలకి సంబంధించిన నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని అన్నారు. మన పౌరులకు ఉపశమనం మరియు మరింత 'ఈజ్ ఆఫ్ లివింగ్' అని ఆ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Oil prices, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు