PM MODI PRESENTS GIFTS TO G 7 LEADERS IN GERMANY UMG GH
PM Modi at G7: జర్మనీలో G7 నేతలకు మోదీ స్పెషల్ గిఫ్ట్స్.. అవేంటో తెలిస్తే గర్వంతో పొంగిపోతారంతే..!
pic credit (Twitter/NarendraModi)
G-7 సమ్మిట్ కోసం మోదీ జర్మనీకి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నేతలను కలిశారు. ఈ సందర్భంగా.. భారతదేశ సాంప్రదాయ కళ, సంస్కృతిని హైలైట్ చేసే ప్రత్యేక బహుమతులను మోదీ G-7 దేశాధినేతలకు అందించారు.
G-7 సమ్మిట్ కోసం మోదీ జర్మనీకి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నేతలను కలిశారు. ఈ సందర్భంగా.. భారతదేశ సాంప్రదాయ కళ, సంస్కృతిని హైలైట్ చేసే ప్రత్యేక బహుమతులను మోదీ G-7 దేశాధినేతలకు అందించారు. ఆయన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్‌కు వారణాసికి చెందిన గులాబీ మీనాకరి బ్రూచ్, కఫ్లింక్ సెట్‌ను బహుమతిగా ఇచ్చారు. యూఎస్ ప్రథమ మహిళ కోసం మ్యాచింగ్ బ్రూచ్తో అందించారు. భారతదేశంలోని వారణాసిలో కనిపించే అరుదైన హస్తకళలలో ఇది ఒకటి. వాస్తవానికి ఇది పర్షియా నుంచి వచ్చిన ఒక కళారూపం. వివిధ రంగులను కలిపి లోహాల ఉపరితలంపై అందంగా రంగులు అద్దుతారు. incredibleindia.org ప్రకారం.. ఈ కళను 17వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ శకంలో పర్షియన్ కళాకారులు వారణాసి నగరానికి తీసుకువచ్చారు.
జపాన్ ప్రధానికి నిజామాబాద్ కుండలు..
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు నిజామాబాద్‌లో తయారైన నల్ల కుండలను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ కుండలకు 2015లో భౌగోళిక గుర్తింపు కోసం రిజిస్టర్ చేశారు. నల్ల కుండల కళ గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి వచ్చింది. పుష్పగుచ్ఛాలు, ప్లేట్లు, దీపాలు మొదలైన వివిధ అలంకార వస్తువులను కూడా తయారు చేస్తారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు.. భారతదేశం పౌరాణిక చరిత్రను తెలియజేసే ఢోక్రా కళతో రూపొందించిన బొమ్మను అందించారు. దీన్ని ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లి ఆయనకు బహుమతిగా అందజేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న నిపుణులు డోక్రా కళను ఉపయోగిస్తారు. మెటల్ కాస్టింగ్ పద్ధతిని భారతదేశంలో 4,000 సంవత్సరాలకు పైగా ఉపయోగించారు.
క్వీన్ ఎలిజబెత్ II ప్లాటినమ్ జూబ్లీని పురస్కరించుకుని, యూకే పీఎం బోరిస్ జాన్సన్‌కు పీఎం మోదీ చేతితో పెయింట్ చేసిన టీ సెట్‌ను బహుమతిగా ఇచ్చారు. బులంద్‌షహర్ నుంచి దీన్ని సేకరించారు. క్రోకరీ ప్లాటినం మెటల్ పెయింట్‌తో, మెహెందీ కోన్ వర్క్‌తో మాన్యువల్‌గా ఎంబోస్డ్ అవుట్లైన్లు రూపొందించారు.
లక్నో నుంచి ప్రత్యేకంగా జర్దోజీ పెట్టెలో ప్యాక్ చేసిన ఇత్తర్ (ittar bottles) బాటిళ్లను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు బహుమతిగా ఇచ్చారు. ఫ్రెంచ్ జాతీయ పతాకం రంగులలో ఖాదీ సిల్క్, శాటిన్ టిష్యూపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పెట్టె మీద ఎంబ్రాయిడరీ చేసిన సాంప్రదాయ ఇండో-పర్షియన్ లోటస్ పువ్వులు కూడా ఉన్నాయి.
ఇటలీ ప్రధానికి మార్బుల్ ఇన్లే టేబుల్ టాప్ బహూకరణ
ఆగ్రా నుంచి తీసుకెళ్లిన మార్బుల్ ఇన్లే టేబుల్ టాప్‌ను ఇటలీ ప్రధాని మారియో డ్రాఘికి మోదీ బహూకరించారు. పాలరాయి పొదుగు(Pietra dura) అనేది ఇటలీలో వికసించి, చివరికి యూరప్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్థాన్ అంతటా వ్యాపించిన పురాతన కళారూపం. పాలరాతిలో పచ్చ, ఒనిక్స్, మణి మొదలైన విలువైన రాళ్లను అమర్చి వీటిని రూపొందిస్తారు.
మొరాదాబాద్ నుంచి తీసుకెళ్లిన మెటల్ మరోడి చెక్కిన మట్కాను జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌కు బహూకరించారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన మొరాదాబాద్ నగరంలో, నికెల్ పూతతో చేతితో చెక్కిన ఇత్తడి పాత్ర.
సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌కు యూపీలోని సీతాపూర్ నుంచి మూన్జ్ బుట్టలు , కాటన్ డ్యూరీలను బహుమతిగా ఇచ్చారు. మూంజ్ బాస్కెట్రీ అనేది వంటగదిలో ఉపయోగించే వస్తువులను తయారు చేయడానికి కాయిలింగ్ టెక్నిక్‌ని ఉపయోగించే క్రాఫ్ట్. ఈ బుట్టలు తేలికైనవి, దీర్ఘకాలం ఉండేవి. మూంజ్ అనేది యూపీలోని అలహాబాద్, గోరఖ్‌పూర్, బెహ్రైచ్ జిల్లాలలోని బంజరు భూములలో పెరిగే అడవి గడ్డి.
ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు లక్కర్వేర్ రామ్ దర్బార్‌ను బహుకరించారు. గూలార్ కలపతో తయారు చేసిన దేవతలు, పవిత్ర జంతువుల చెక్క విగ్రహాలు ఉన్నాయి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పట్టు తివాచీని ప్రధాన మంత్రి బహుమతిగా ఇచ్చారు. ఇది కశ్మీర్లో చేతితో అల్లిన తివాచీ. ప్రపంచంలోని అత్యుత్తమ సిల్క్‌లో ఒకటిగా పేరున్న కశ్మీరీ సిల్క్.. విలాసవంతమైన ఆకృతికి, బ్రైట్ కలర్స్‌కు ప్రసిద్ధి.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.