హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra modi : కరోనా టీకా తయారీదారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం.. వారికి ఏం చెప్పారంటే..

PM Narendra modi : కరోనా టీకా తయారీదారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం.. వారికి ఏం చెప్పారంటే..

టీకా తయారీదారులతో మోదీ సమావేశం (Photo: ANI/ twitter)

టీకా తయారీదారులతో మోదీ సమావేశం (Photo: ANI/ twitter)

దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ (vaccine doses)ల మైలురాయిని సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra modi) భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీదారులతో శనివారం సమావేశమయ్యారు. దేశీయ వ్యాక్సిన్ తయారీపై PM మోదీ (modi) వారి ప్రయత్నాలను ప్రశంసించారు.

ఇంకా చదవండి ...

ప్రపంచలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) డ్రైవ్ చేపట్టి భారత్.. ఇవాళ సరికొత్త మైలు రాయిని అందుకుంది. టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు దాటాయి. వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 9 నెలల్లోనే ఈ రికార్డు ఫీట్‌ను అందుకుంది. దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ (vaccine doses)ల మైలురాయిని సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra modi) భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీదారులతో (Domestic vaccine manufacturers) శనివారం సమావేశమయ్యారు.  సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈవో అదర్​ పూనావాలా, భారత్ బయోటెక్ (Bharat biotech), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (DR Reddies laboratories), జైడస్ కాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ వంటి ఏడు వ్యాక్సిన్ తయారీదారుల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఇండియాలోని అర్హులైన వ్యక్తులకు వీలైనంత త్వరగా (as much as possible) టీకాలు వేయాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.

ఎన్నడూ చూడని సహకారం..

“అందరికీ వ్యాక్సిన్” అనే మంత్రంలో ముందుకు వెళ్లాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.  దేశీయ వ్యాక్సిన్ తయారీపై PM మోదీ (modi) వారి ప్రయత్నాలను ప్రశంసించారు. దీని ఫలితంగానే భారతదేశం 100 కోట్ల టీకా మార్కు (crossed 100 crores mark)ను దాటామని కొనియాడారు.

టీకా తయారీదారులు మరియు ప్రభుత్వం (government) మధ్య ఎన్నడూ చూడని సహకారం ఉందని మోదీ తెలిపినట్లు ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హాజరు..

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Union health minister) మన్సుఖ్ మాండవ్య (Mansukh Mandavya), కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ (Bharati praveen pawar) కూడా పాల్గొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా (As per health department data) ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 101.30 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

కాగా, జనవరిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కొత్తలో టీకాల పంపిణీ నెమ్మదిగా జరిగింది. ఇలా అయితే 100 కోట్ల మందికి టీకాలు వేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో..? అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ కేవలం 9 నెలల్లోనే 100 కోట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది భారత్. చైనా (China) తర్వాత 100 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) వేసిన రెండో దేశంగా నిలిచింది.

First published:

Tags: Bharat Biotech, Corona Vaccine, Covid vaccine, Pm modi, PM Narendra Modi, Review meeting

ఉత్తమ కథలు