Home /News /national /

PM Modi: జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సుదీర్ఘ సమావేశం.. కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం

PM Modi: జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సుదీర్ఘ సమావేశం.. కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
    న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. మొత్తం 8 పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దాదాపు 14 మంది నేతలతో రెండు గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌ నేతలతో జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే కావడంతో ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్, చట్ట సభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలుపగా.. మెహబూబా ముఫ్తీ‌తో పాటు పలువురు జమ్మూకశ్మీర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు నేతలు నెలల పాటు నిర్భందంలోనే ఉన్నారు. అయితే.. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించడంతో పాటు అక్కడి రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

    ఈ సమావేశానికి వెళుతున్న సందర్భంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను సమావేశానికి వెళుతున్నానని, తమ డిమాండ్లను ప్రధాని ముందు ఉంచుతామని చెప్పారు. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. మెహబూబా ముఫ్తీ గురించి అడగ్గా.. పీడీపీ పార్టీకి ఆమె అధ్యక్షురాలని, ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో తనకెలా తెలుస్తుందని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఈ అఖిలపక్ష సమావేశంలో నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా హై అలర్ట్ ప్రకటించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో 48 గంటల పాటు హై అలర్ట్ విధించారు. ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Amit Shah, Article 370, Jammu and Kashmir, Mehbooba Mufti, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు