కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 43 మంది ప్రమాణం చేశారు. వీరిలో కొందరు కొత్తగా కేబినెట్లో అడుగుపెట్టగా.. మరికొందరు ప్రస్తుతం సహాయ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల్లో ముందుగా నారాయణ రాణె(మహారాష్ట్ర) మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అనంతరం సర్బానంద సోనోవాల్ (అసోం), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), జ్యోతిరాధిత్య సింధియా(మధ్యప్రదేశ్), రామచంద్ర ప్రసాద్ సింగ్(బీహార్), అశ్వనీ వైష్ణవ్ (ఒడిశా), పశుపతి కుమార్ పారస్(బీహార్), కిరణ్ రిజుజు(అరుణాచల్ ప్రదేశ్), రాజ్ కుమార్ సింగ్ (బీహార్), హరిదీప్ సింగ్ పూరి( ఢిల్లీ), మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయా(గుజరాత్), భూపేంద్ర యాదవ్(రాజస్థాన్), పురుషోత్తం రూపాలా(గుజరాత్), కిషన్ రెడ్డి( తెలంగాణ),అనురాగ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్), పంకజ్ చౌదరి (ఉత్తరప్రదేశ్),అనుప్రియ పటేల్ (ఉత్తరప్రదేశ్), సత్యపాత్ సింగ్ బఘేల్(ఉత్తరప్రదేశ్), రాజీవ్ చంద్రశేఖర్( కర్ణాటక), శోభా కరంద్లాజె(కర్ణాటక), భానుప్రతాప్ సింగ్ వర్మ(ఉత్తరప్రదేశ్), దర్శన విక్రమ్ జర్దోష్(గుజరాత్), మీనాక్షి లేఖి(ఢిల్లీ),అన్నపూర్ణ దేవి యాదవ్(జార్ఖండ్), నారాయణస్వామి(కర్ణాటక),కౌశల్ కిశోర్(ఉత్తరప్రదేశ్), అజయ్ భట్ (మధ్యప్రదేశ్), బీఎల్ వర్మ(ఉత్తరప్రదేశ్),అజయ్ కుమార్(ఉత్తరప్రదేశ్), దేవ్ సింహ్ చౌహాన్(గుజరాత్),భగవంత్ ఖూబా(కర్ణాటక), కపిల్ మోరేశ్వర్(మహారాష్ట్ర), ప్రతిమ భౌమిక్(త్రిపుర), భగవత్ కృష్ణరావ్ కరాడ్(మహారాష్ట్ర), రాజ్ కుమార్ రంజన్ సింగ్(మణిపూర్), భారతి పవార్(మహారాష్ట్ర), విశ్వేశ్వర్ తుడు(ఒడిశా), మహేంద్ర భాయ్ ముంజపరా(గుజరాత్), జాన్ బర్లా(బెంగాల్), ఎల్. మురుగన్( తమిళనాడు), నిశిత్ ప్రామాణిక్(బెంగాల్), మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేంద్ర కేబినెట్లోకి 12 మంది ఎస్సీలకు చోటు కల్పించిన ప్రధాని మోదీ వారిలో ఇద్దరిక కేబినెట్ ర్యాంక్ కల్పించారు. 8 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చిన బీజేపీ నాయకత్వం.. ముగ్గురికి కేబినెట్ ర్యాంకు ఇచ్చింది. మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు చోటు కల్పించిన ప్రధాని మోదీ.. వారిలో ఐదుగురికి కేబినెట్ ర్యాంకు కల్పించింది. 11 మంది మహిళా మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించిన బీజేపీ నాయకత్వం.. వారిలో ఇద్దరికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది. ఐదుగురు మైనార్టీ మంత్రులకు కేబినెట్లోకి తీసుకున్న బీజేపీ.. వారిలో ముగ్గురికి కేబినెట్ ర్యాంక్ కల్పించింది. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇప్పటివరకు కొనసాగుతున్న మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ సహా 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.