PM Modi USA Tour: అమెరికాలో ప్రధాని మోదీ బిజిబిజీ.. క్వాల్‌కామ్ సీఈవోతో భేటీ

ప్రధాని మోదీతో క్వాల్‌కామ్ సీఈవో క్రిస్టియానో అమన్‌ భేటీ

PM Modi USA Tour: భారత్‌లోని నైపుణ్యాన్ని క్వాల్‌కామ్ సంస్థ చవిచూసిందన్న ప్రధాని మోదీ.. దేశంలో సంస్థ ఉత్పత్తిని ప్రారంభించి పీఎల్ఐ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలని సూచించారు.

  • Share this:
    మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. దిగ్గజ సంస్థ క్వాల్‌కామ్ సీఈవో క్రిస్టియానో అమన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపించారు. భారత్‌తో 5జీ టెక్నాలజీతో పాటు డిజిటల్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని ప్రధాని మోదీకి తెలిపారు. భారత్‌లో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి అమన్‌ ప్రధాని మోదీతో చర్చించారు. భారత్ ఓ పెద్ద మార్కెట్ అని.. అయితే తాము భారత్‌ను పెద్ద ఎగుమతి మార్కెట్‌గా కూడా చూస్తామని పేర్కొన్నారు. భారత్‌తో కేవలం భారత్ కోసం తయారు చేయడమే కాకుండా ఇతర దేశాల అవసరాల కోసం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సెమీ కండక్టర్ల రంగంలో భారత్‌తో కలిసి పని చేసేందుకు క్వాల్‌కామ్ సీఈవో ఆసక్తి చూపించారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్వాల్‌కామ్ సంస్థ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతోందని అన్నారు. 5జీ టెక్నాలజీ కోసం భారత్ సిద్ధమవుతోందని.. ఇందులో క్వాల్‌కామ్ కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు.

    ఇప్పటికే భారత్‌లోని నైపుణ్యాన్ని క్వాల్‌కామ్ సంస్థ చవిచూసిందన్న ప్రధాని మోదీ.. దేశంలో సంస్థ ఉత్పత్తిని ప్రారంభించి పీఎల్ఐ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఇదే సమయంలో సంస్థ సీఈవోతో సరళీకృతమైన డ్రోన్ పాలసీ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు. అభివృద్ధి చెందుతున్న భారత్ మార్కెట్‌లోని అవకాశాల్లో క్వాల్‌కామ్ కూడా భాగం కావాలని ఆకాంక్షించారు.

    Benefits Of Ghee: నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఈ రకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టండి

    TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు

    ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం క్వాల్‌కామ్ సీఈవో ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీతో భేటీని గొప్ప సమావేశంగా అభివర్ణించారు. భారత్‌తో కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: