హోమ్ /వార్తలు /జాతీయం /

ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం...? ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ట్రపతి కోవింద్...

ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం...? ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ట్రపతి కోవింద్...

దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

2014 ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ దక్షిణాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులను ఆహ్వానించారు. అయితే ఈసారి ఆగ్నేయాసియాతో పాటు పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు పీఎంవో వర్గాలు భావిస్తున్నాయి.

    సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం, ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అలాగే ప్రమాణ స్వీకార తేదీ, సమయంపై కూడా చర్చలు కొనసాగాయి. అయితే ప్రమాణ స్వీకారం ఈ నెల 30న జరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రధానిమోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను భారీగా ఆహ్వానించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ దక్షిణాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులను ఆహ్వానించారు. అయితే ఈసారి ఆగ్నేయాసియాతో పాటు పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు పీఎంవో వర్గాలు భావిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో పాటు, జపాన్ ప్రధాని షింజో అబే, అబుదాబీ యువరాజు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వంటివారిని ఆహ్వానించే అవకాశం ఉంది.


    అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అన్ని దేశాల రాయబారులు ఆహ్వానితుల లిస్టులో ఉన్నారు.

    First published:

    Tags: Narendra modi, Pm modi, Ramnath kovind

    ఉత్తమ కథలు