Home /News /national /

PM MODI MANN KI BAAT UPDATES USE TIRANGA AS SOCIAL MEDIA PROFILE FROM AUGUST 2 SAYS PM MODI AMID INDIA 75TH INDEPENDENCE DAY MKS

PM Modi | Mann ki Baat : ఆగస్టు 2 నుంచి మీ సోషల్ మీడియా డీపీ ఇలా మార్చుకోండి : మోదీ

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాను వినియోగించే పౌరులంతా తమ డిస్‌ప్లే పిచ్చర్ (డీపీ) లేదా ప్రొఫైల్ గా మూడు రంగుల జెండాను ఉంచాలని ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రధాని మోదీ కోరారు. వివరాలివే..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Tirupati | Vijayawada | Visakhapatnam
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా వర్ధిల్లుతోన్న భారత్ మరికొద్ది రోజుల్లోనే 75వ స్వాతంత్ర్యవేడుకలను (India's 75th Independence Day) ఘనంగా జరుపుకొందామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య వేడుకలను ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’పేరుతో కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ (Mann ki Baat)కార్యక్రమం ద్వారా ప్రధాని కీలక సందేశం, సూచనలు చేశారు.

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాను వినియోగించే పౌరులంతా తమ డిస్‌ప్లే పిచ్చర్ (డీపీ) లేదా ప్రొఫైల్ గా మూడు రంగుల జెండాను ఉంచాలని ప్రధాని మోదీ కోరారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్ లో తిరంగాను పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. ఇవాళ (నెలలో చివరి ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమం 91వ ఎడిషన్ లో మాట్లాడుతూ మోదీ ఈ మేరకు సూచించారు.

CM KCR : గండం గట్టెక్కేనా? ఉద్యోగులకు సకాలంలో జీతం అందేనా? ఢిల్లీలో కేసీఆర్ ఏం చేశారు?


దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టిన మొత్తం 75 రైల్వే స్టేషన్లను ప్రజలు పిల్లలతో సహా సందర్శించాలని, ఆయా స్టేషన్లలో మహానేతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ, వారి త్యాగాలను మననం చేసుకోవాలని ప్రధాని కోరారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నానని, వారి త్యాగాలు వెలకట్టలేనివని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో అమరుల స్మరణ ముఖ్యాంశమని మోదీ అన్నారు.



మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని మోదీ.. స్వాతంత్ర్య విప్లవయోధుడు సర్దార్ ఉధమ్‌సింగ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇవాళ (జులై 31) సర్దార్ ఉధమ్ సింగ్ 82వ వర్ధంతి కూడా కావడంతో ఆ మహనీయుడికి మోదీ నివాళి అర్పించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Independence Day, India, Mann Ki Baat, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు