వోకల్ ఫర్ లోకల్ పాటించడమే దేశానికి గొప్ప సేవ... ప్రధాని మోదీ మన్ కీ బాత్ సందేశం...

ప్రధానమంత్రి ఇదివరకటి కంటే ఇప్పుడు మన్ కీ బాత్‌ను మరింత సమర్థంగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన విషయాల్ని కూడా రేడియో కార్యక్రమంలో చెబుతున్నారు.

news18-telugu
Updated: June 28, 2020, 12:43 PM IST
వోకల్ ఫర్ లోకల్ పాటించడమే దేశానికి గొప్ప సేవ... ప్రధాని మోదీ మన్ కీ బాత్ సందేశం...
లోకల్ ఈజ్ వోకల్ పాటించడమే దేశానికి గొప్ప సేవ... ప్రధాని మోదీ మన్ కీ బాత్ సందేశం...
  • Share this:
ప్రధానమంత్రి మన్ కీ బాత్ అంటే... దేశంలోని సిటీల్లో ప్రజలు అంతగా ఆసక్తి చూపరేమోగానీ... పల్లెపల్లెల్లో... రేడియోలు మార్మోగుతున్నాయి. ఈసారి మన్ కీ బాత్‌లో మోదీ... చాలా ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించారు. ప్రధానంగా... కరోనా వచ్చి ఆరు నెలలు అయిపోయిందన్న మోదీ... అందరూ 2020 ఎప్పుడు అంతమవుతుందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం చాలా సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మనం సవాళ్లు వచ్చినప్పుడల్లా ఎదురు నిలిచి గెలిచినట్లు మన చరిత్ర చెబుతోందని మోదీ గుర్తుచేశారు. సవాళ్ల తర్వాత మనం మరింత బలంగా అవుతామని అన్నారు.

చైనా వివాదంపై స్పందించిన మోదీ... లడక్‌లోకి వచ్చేందుకు యత్నించిన చైనా సైన్యానికి భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందన్నారు. దేశానికి సమస్య వచ్చే పరిస్థితి రానివ్వబోమని మన సైనికులు నిరూపించారన్న మోదీ... మొన్నటి ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులవ్వడంపై దేశంలోని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారని అన్నారు. అమరులైన సైనికుల తల్లిదండ్రులు మరింత మందిని సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారనీ.. అది మన బలం అని మోదీ అన్నారు.

భారత్‌ను శాంతియుత దేశంగా ప్రపంచం చూస్తోందన్న మోదీ... దేశ ప్రజలు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారనీ... కానీ... శాంతి మంత్రం పఠిస్తున్నందున... మనం... వోకల్ ఫర్ లోకల్ విధానం ద్వారా... దేశానికి గొప్ప సేవ చేసినట్లు అవుతుందన్నారు. తద్వారా చైనా ఉత్పత్తులు వాడొద్దని పరోక్షంగా మోదీ చెప్పినట్లైంది.

కరోనా పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలనీ, అందరూ మాస్కులు వాడాలని మోదీ కోరారు. సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా ఇతరుల్ని జాగ్రత్తగా ఉంచగలం అన్నారు ప్రధాని మోదీ.

మాజీ ప్రధాని వీపీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన వేళ... ప్రధాని మోదీ... ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. పీవీ... భారత దేశ ముద్దు బిడ్డ అన్న ఆయన... అత్యంత విపత్కర సమయంలో ఇండియాని ముందుకు నడిపారని మెచ్చుకున్నారు. గొప్ప రాజకీయ వేత్త, గొప్ప ప్రతిభాశాలి అని అన్నారు. చిన్నప్పటి నుంచే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం ఉన్న పీవీ... దేశ ప్రజలు... ఆయన చరిత్రను తెలుసుకోవాలని కోరారు.
First published: June 28, 2020, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading