హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi Mann Ki Baat: ఆ డబ్బు మొత్తం "నమామి గంగే" కోసం అందజేస్తాను.. ఖాదీ ఉత్పత్తులు కొనండి.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..

PM Modi Mann Ki Baat: ఆ డబ్బు మొత్తం "నమామి గంగే" కోసం అందజేస్తాను.. ఖాదీ ఉత్పత్తులు కొనండి.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

దేశ ప్రజలు ప్రతి నీటి బొట్టుకు విలువను ఇవ్వాలని.. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పిలుపునిచ్చారు.

దేశ ప్రజలు ప్రతి నీటి బొట్టుకు విలువను ఇవ్వాలని.. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఆయన తన 81వ మన్ కీ బాత్ (Mann Ki Baat) ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  నేడు ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకుంటామని.. నదులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అంతేకాకుండా ఖాదీ ఉత్పత్తులను మరింత ఎక్కువగా కొనుగోలు చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి జరుపుకుంటామని.. ఈ సందర్భంగా పరిశుభ్రతను పాటించడం ద్వారా మహాత్మునికి ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని మోదీ తెలిపారు. దివంగత నేత దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి(సెప్టెంబర్ 25) సందర్భంగా మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం, సమాజాన్ని బలోపేతం చేయడానికి అతని విధానాలు, అంత్యోదయకు ఆయన చూపిన మార్గం నేటికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. తన అమెరికా పర్యటన నేపథ్యంలో.. అక్కడికి బయలుదేరే ముందే ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసి వెళ్లినట్టుగా మోదీ చెప్పారు.

‘ఈ రోజు మనం ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది నిస్వార్థంగా మనకు నీటిని అందించే మన నదుల సహకారాన్ని గుర్తుంచుకునే రోజు. కనీసం ఏడాదికి ఒక్కసారైన నదుల పండగ జరుపుకోవాలని నేను దేశ ప్రజలను కోరుతున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బహుమతుల ఈ వేలం ద్వారా వచ్చిన నగదును నమామి గంగే ప్రచారానికి అందజేస్తాను’అని మోదీ తెలిపారు.


‘స్వాతంత్య్రోద్యమానికి పారిశుద్ద్య ప్రచారం నిరంతర శక్తిని ఎలా అందించిందో నేటి యువత తెలుసుకోవాలి. పరిశుభ్రతను ప్రజాఉద్యమంగా మలిచింది మహాత్మా గాంధీ. మహాత్మాగాంధీ పరిశుభ్రతను దేశ స్వాతంత్ర్య స్వప్నంతో ముడిపెట్టారు. పరిశుభ్రత అనేది గౌరవనీయులైన బాపుకి ఈ దేశం అందించే ఒక పెద్ద నివాళి. మనం ప్రతిసారీ ఆ నివాళిని అందజేయాలి’అని మోదీ తన మన్‌ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Modi- Biden Meet: మోదీ- జో బైడెన్ చర్చల్లో నవ్వులే నవ్వులు.. ఆ నవ్వులకు కారణం ఏంటంటే..


‘రానున్నది పండగల కాలం.. మనం కరోనాపై పోరాటాన్ని కొనసాగించాలి. వ్యాక్సినేషన్ విషయంలో టీమిండియా ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తుంది’అని మోదీ చెప్పారు.

‘డిజిటల్ చెల్లింపులు UPI ద్వారా జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో 350 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు UPI ద్వారా జరిగాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వస్తుంది. జన్ ధన్ ఖాతాల ద్వారా నేడు పేదలకు డబ్బు నేరుగా వారి ఖాతాలకే చేరుతుంది. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పని జరుగుతుంది’అని మోదీ అన్నారు.

ఖాదీ ఉత్పతులను కొనుగోలు చేయండి..

వచ్చే నెల గాంధీ జయంతిని నేపథ్యంలో ఖాదీ ఉత్పత్తులను ఎంతో ఉత్సాహంతో కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండగలకు ఖాదీ వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. నేడు ఖాదీ, చేనేత ఉత్పత్తి అనేక రెట్లు పెరిగిందన్న మోదీ.. వాటి డిమాండ్ కూడా పెరిగిందని చెప్పారు.

First published:

Tags: Mann Ki Baat, PM Narendra Modi, Swachh Bharat

ఉత్తమ కథలు