హోమ్ /వార్తలు /జాతీయం /

కాశీ టూ పూరీ? నరేంద్ర మోదీ ఎక్కడ పోటీ చేయబోతున్నారు?

కాశీ టూ పూరీ? నరేంద్ర మోదీ ఎక్కడ పోటీ చేయబోతున్నారు?

వారణాసిలో మోదీ (File)

వారణాసిలో మోదీ (File)

బీజేపీ నేతలు ఏం చెప్పినా...అసలు మోదీ మనసులో ఏముందన్నది తెలియాల్సి ఉంది. ఈ వారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యే అవకాశముంది. మరి వారణాసి నుంచే మోదీ పోటీచేస్తారా? లేదంటే వారణాసి, పూరి..రెండు చోట్లా బరిలోకి దిగుతారా? అనేది చూడాలి.

ఇంకా చదవండి ...

  దేశమంతా లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంపై దృష్టిసారించాయి. ఐతే ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ఎక్కడి నుండి పోటీచేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ..రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పూరీ (ఒడిశా) నుంచి పోటీచేస్తారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వారణాసిని పూర్తిగా వదిలేసి..కేవలం పూరీలోనా పోటీచేస్తారా? లేదంటే రెండు చోట్లా పోటీచేస్తారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.


  2014 ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో మోదీ పోటీచేశారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో వడోదరాతో పాటు ప్రముఖు ఆధ్మాత్మిక నగరం వారణాసి నుంచి పోటీ..రెండు చోట్లా గెలుపొందారు. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, ఆమాద్మీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వడోదరా స్థానానికి రాజీనామా చేసి వారణాసిని అట్టిపెట్టుకున్నారు. గత ఎన్నికల్లో యూపీని క్వీప్ చేసిన బీజేపీ..ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎస్సీ-బీఎస్పీ జతకట్టడంతో ఇప్పటికే గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. మాయావతి-అఖిలేశ్ కూటమి ప్రభావం ఇలాగే కొనసాగితే బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసి నుంచి కాకుండా వేరొక ప్రాంతం నుంచి పోటీచేయాలని మోదీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో..ఈ ఎన్నికల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. యూపీలో గతంలో వచ్చినన్ని సీట్లు రాకున్నా...ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తే.. మరోసారి కేంద్రంలో బలమైన, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలోనే మరో టెంపుల్ సిటీ పూరీపై మోదీ కన్నేసినట్లు సమాచారం. మోదీ అక్కడి నుంచి బరిలోకి దిగితే...ఒడిశాలో బీజేపీ పుంజుకుంటుందని యోచిస్తున్నారు. ఇటీవల ANIకి మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీలో పోటీచేసే అంశంపై ప్రస్తావన వచ్చింది. కానీ మోదీ ధృవీకరించలేదు..అలాగనీ ఖండించనూ లేదు. మీడియాకు కూడా పని ఉండాలి కదా...అంటూ సమాధానం దాటవేశారు.


  ఐతే మోదీ పూరీ నుంచి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించారు. మళ్లీ వారణాసి పార్లమెంటరీ స్థానం నుంచే ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తారని వెల్లడించారు. బీజేపీ నేతలు ఏం చెప్పినా...అసలు మోదీ మనసులో ఏముందన్నది తెలియాల్సి ఉంది. ఈ వారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యే అవకాశముంది. మరి వారణాసి నుంచే మోదీ పోటీచేస్తారా? లేదంటే వారణాసి, పూరి..రెండు చోట్లా బరిలోకి దిగుతారా? అనేది చూడాలి. కాగా, వారణాసి నియోజకవర్గంలో ఏడోదశలో మే 19న ఎన్నికలు జరగనున్నాయి.


  First published:

  Tags: Bjp, Lok Sabha Election 2019, Pm modi, Varanasi

  ఉత్తమ కథలు