హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : తన రికార్డు తానే బద్దలుకొట్టిన మోదీ -ప్రాంతీయ అసమానతలపైనా కీలక వ్యాఖ్యలు

PM Modi : తన రికార్డు తానే బద్దలుకొట్టిన మోదీ -ప్రాంతీయ అసమానతలపైనా కీలక వ్యాఖ్యలు

మోదీ (ఫైల్ ఫొటో)

మోదీ (ఫైల్ ఫొటో)

తమిళనాడులో ఒకే రోజు 11 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా తన రికార్డును తానే బద్దలు కొట్టానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2014నాటికి దేశంలో మొత్తం కలిపి 380 మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 596కు పెరిగిందని, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల పరంగా 2014లో 82వేల సీట్లుంటే ఇప్పుడు 1.48లక్షల సీట్లు పెరిగాయని మోదీ గుర్తు చేశారు.

ఇంకా చదవండి ...

తన రికార్డును తానే బ్రేక్ చేశానని, అందుకు తానెంతో గర్విస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులో ఏర్పాటు చేసిన 11 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాలేజీలను ప్రారంభిస్తూ, గత నెలలో ఉత్తరప్రదేశ్ లో ఒకే రోజు 9 కొత్త మెడికల్ కాలేజీలకు అంకురార్పణ చేశానని, ఇవాళ తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా తన రికార్డును తానే బద్దలు కొట్టానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా తమిళనాడుకు భారీ వరాలు కురిపించిన ఆయన.. ప్రాంతీయ అసమానతలపైనా కీలక కామెంట్లు చేశారు. జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వమే నిరసన తెలిపిన దరిమిలా కొత్త కాలేజీల ఏర్పాటుతో మెడికల్ విద్యలో రాష్ట్రానికి అవకాశాలు పెరగనున్నాయి.

తమిళనాడులో ఇప్పటికే ఉన్న 27 మెడికల్ కాలేజీల్లో 5125 సీట్లున్నాయని, కొత్త కాలేజీల ఏర్పాటు ద్వారా మరో 1450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య విద్యను పట్టించుకోలేదని, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటైన తర్వాతే మెడికల్ విద్యకు మహార్దశ పట్టిందని, 2014నాటికి దేశంలో మొత్తం కలిపి 380 మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 596కు పెరిగిందని, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల పరంగా 2014లో 82వేల సీట్లుంటే ఇప్పుడు 1.48లక్షల సీట్లు పెరిగాయని మోదీ గుర్తు చేశారు.

cm kcr : లక్షల నాగళ్లతో modiపై తిరుగుబాటు.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిద్దామంటూ..దేశంలో ప్రాంతీయ అసమానతలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు. తమిళనాడుకు రాబోయే ఐదేళ్లలో ఒక్క మెడికల్ రంగానికే రూ.3000కోట్ల నిధులను సమకూర్చుతామని మోదీ హామీ ఇచ్చారు. ఎన్డీఏ సర్కారు ముందుచూపు వల్ల రాబోయే రోజుల్లో వైద్య విద్యకు, పరిశోధనలకు భారత్ కేంద్రంగా ఉండబోతోందని చెప్పారు. కరోనా అనంతర పరిస్థితుల్లో మెడికల్ రంగంలోకి పెట్టుబడుల వరద ఉంటుందని, ఇది విద్యా రంగం అభివృద్దికి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు.

Covid విలయం: చేతులెత్తేసిన అమెరికా? : కరోనాతో కలిసి బతికే దశకు చేరామన్న Anthony Fauciప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా లేని అన్ని జిల్లాల్లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానంగా కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించాలనే కార్యక్రమాన్ని మోదీ సర్కార్ చేపట్టడం తెలిసిందే. గత నెలలలో యూపీలో 9 మెడికల్ కాలేజీలు, ఇప్పుడు తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలు అలా ఏర్పాటయినవే. తమిళనాడులో 11మెడికల్ కాలేజీలతో పాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త క్యాంపస్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ విద్యా సంస్థలో సంప్రదాయ భాషలు, భారత సంస్కృతిని పరిరక్షించే కోర్సులు నేర్పిస్తారు.

covid shocking: ఒక్కరు కూడా మిగలరు.. బూస్టర్ డోసులూ ఆపలేవు: ప్రభుత్వ నిపుణుల వార్నింగ్తమిళనాడులో ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు విరుద్ధునగర్, నమక్కల్, ద నీలిగిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్నం, దిండిగల్, కల్లకురుచి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో ఏర్పాటయినవి. ఈ కాలేజీల ఏర్పాటుకు రూ.4వేల కోట్ల అంచనా కాగా, కేంద్రం నుంచి రూ.2వేల 145కోట్లు కేటాయించగా, మిగతా మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించింది.

Published by:Madhu Kota
First published:

Tags: Medical colleges, Pm modi, Tamil nadu

ఉత్తమ కథలు