పరీక్షలంటేనే పిల్లల్లో అదో టెన్షన్.. ఈ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని తిట్టుకొని స్టూడెంట్ ఉండడు. ఇక పరీక్షల సీజన్ సమయంలో వాళ్లు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. ఎగ్జామ్ గురించే ఆలోచిస్తూ సరిగ్గా భోజనం కూడా చేయరు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అదే సమయంలో ఎవరైనా కాస్త మోటివేషన్ ఇస్తే చాలు.. చాలా ఎనర్జీ ఫిల్ అవుతారు. ఏ భయం లేకుండా ఎగ్జామ్స్‌కు ప్రిపెర్ అవుతారు.. అదే మోటివేషనల్ స్పీకర్ స్వయంగా ప్రధాని అయితే ఆ ఫీలింగే వేరు.. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించాలనే మంచి ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం పరీక్షా పే చర్చ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు మోదీ. ఈ ప్రోగ్రామ్‌కి ఆయనే హోస్ట్.. పరీక్షల సమయం దగ్గర పడడంతో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు మోదీ. విద్యార్థులకు విలువైన సూచనలిచ్చారు. ఎగ్జామ్స్‌కు ఎలా ప్రీపేర్ అవ్వాలో తనదైన స్టైల్‌లో వివరించారు.
పరీక్షా కాలం:
విద్యార్థులకు పరీక్షల కాలం వచ్చేసింది. వచ్చే నెలలోనే సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిఏడాదిలాగే మోదీ పరీక్ష పే చర్చ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం ఈ చర్చకు వేదికైంది. ఈ కార్యక్రమంలో సుమారు 39 లక్షల మంది పాల్గొన్నారు. అందులో విద్యార్థులే 31.24లక్షల మంది ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లు టీచర్లు, తల్లిదండ్రులు. గతేడాది పరీక్షా పే చర్చలో దాదాపు 16లక్షల మంది పాల్గొంటే ఈ ఏడాది ఏకంగా 39లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో దేశవ్యాప్తంగా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానామిచ్చారు.
PM Modi advices parents to do correct assessment of their children. There is always something extraordinary in an average person & something average in an extraordinary person. Never be under pressure to be extraordinary, he says. https://t.co/b9K0J2A3OH#ParikshaPeCharcha pic.twitter.com/iO2AufTsJe
— DD India (@DDIndialive) January 27, 2023
పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దు:
పిల్లలపై ఒత్తడి పెట్టొద్దంటూ మోదీ తల్లిదండ్రులకు, టీచర్లకు సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. అలా చేసినప్పుడే పిల్లలు బాగా చదువుతారన్నారని అభిప్రాయపడ్డారు మోదీ.ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ మైండ్‌తో పిల్లలు పరీక్షలు రాసేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రలు, టీచర్లదేనన్నారు. ఇక సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై అసలు ప్రెజర్ పెట్టొద్దని మోదీ సూచించారు.
WATCH | The time management skills of mothers is the best. Observe your mothers to efficiently learn the art of time management.
Micro management is imp to distribute your time properly, says PM Modi Link: https://t.co/b9K0J2A3OH@PMOIndia@EduMinOfIndia#ParikshaPeCharcha pic.twitter.com/GkIm48MIR8 — DD India (@DDIndialive) January 27, 2023
అమ్మను చూసి నేర్చుకోవాలి:
ఇక సమయపాలన గురించి మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో సమయపాలన అతి ప్రధానమైనదని మోదీ చెప్పారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే..సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందని సూచించారు. ఇక విద్యార్థుల ఒత్తిడిని మోదీ క్రికెట్‌తో పోల్చారు. విద్యార్థులు తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోవాలన్నారు.ఇక లైఫ్‌లో షార్ట్ కట్స్ వద్దంటూ..ఎగ్జామ్‌లో చీటింగ్ చేయొద్దని తెలిపారు మోదీ. ఇక విద్యార్ధుల కోసం నిత్యం మోదీ ఆలోచిస్తూనే ఉంటారు. గతంలో పరీక్షల అంశంపై మోదీ ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cbse exams, Narendra modi, Pariksha Pe Charcha, Students