రిపబ్లిక్ డే కళాకారులను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఆదివారం ఏ కార్యక్రమం జరిగినా అది సూపర్ హిట్టే అవుతుంది. రిపబ్లిక్ డే కూడా ఆదివారం రావడం విశేషం. అందులో ప్రతిభను ప్రదర్శించే కళాకారుల్ని కలిసిన ప్రధాని మోదీ... వాళ్లను మెచ్చుకున్నారు.

news18-telugu
Updated: January 25, 2020, 10:57 AM IST
రిపబ్లిక్ డే కళాకారులను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
రిపబ్లిక్ డే కళాకారులను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ (credit - YT - Narendra Modi)
  • Share this:
మన దేశంలో ఎప్పుడు గణతంత్ర దినోత్సవం జరిగినా... దేశవ్యాప్తంగా ఉండే వేర్వేరు రాష్ట్రాల కళాకారులు ఢిల్లీ వచ్చి పరేడ్‌లో ప్రదర్శనలు ఇస్తారు. ఈసారి కూడా వాళ్లంతా ఆదివారం జరిగే 71వ రిపబ్లిక్ డేలో ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ముందుగా చేసే రిహార్సల్స్‌‌కి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కళాకారులు, NCC కాడెట్ల పెర్ఫార్మెన్స్‌ను కళ్లారా చూశారు. ఈ ఎట్ హోం కార్యక్రమంలో... ప్రధానితోపాటూ... గిరిజన అతిథులు కూడా పాల్గొన్నారు. ఈ కళాకారుల రిహార్సల్స్ ప్రదర్శనలను మోదీతోపాటూ... చాలా మంది ప్రజలు చూశారు. ఇదంతా చూస్తుంటే... మినీ ఇండియాని చూసినట్లు ఉందని ప్రధాని మోదీ అన్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత దేశ సారాన్ని మీరు ప్రతిబింబిస్తారు అని మోదీ వాళ్లను మెచ్చుకున్నారు. ఇండియా అంటే భౌగోళికంగా ఓ ప్రాంతం, ఓ జనాభా మాత్రమే కాదన్న మోదీ... ఇండియా అంటే సర్వ కళలు, సంప్రదాయాలు, ఆచారాల మేళవింపు అంటూ కళాకారుల్ని మెచ్చుకున్నారు. ఆ అద్భుతమైన వీడియోను మీరూ చూడండి.First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు