హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: భారత క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్.. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన ప్రధాని

PM Modi: భారత క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్.. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన ప్రధాని

క్రీడాకారులతో వర్చువల్ సమావేశమైన ప్రధాని మోదీ

క్రీడాకారులతో వర్చువల్ సమావేశమైన ప్రధాని మోదీ

కామన్వెల్త్‌ గేమ్స్‌(Commonwealth Games)కి ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ(PM Modi) బుధవారం వర్చువల్‌గా ఇంటరాక్ట్‌ అయ్యారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌, బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో పాల్గొననున్న భారత క్రీడాకారుల్లో మోదీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

ఇంకా చదవండి ...

Commonwealth Game 2022కామన్వెల్త్‌ గేమ్స్‌(Commonwealth Games)కి ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ(PM Modi) బుధవారం వర్చువల్‌గా ఇంటరాక్ట్‌ అయ్యారు. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌, బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో పాల్గొననున్న భారత క్రీడాకారుల్లో మోదీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఒత్తిడి లేకుండా మీ శక్తిని అంతా ఉపయోగించి ఆడండి. మీరు ‘కోయి నహీ హై టక్కర్ మే, క్యున్ పాడే హో చక్కర్ మే’ అనే సామెతను విని ఉంటారు. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా అదే వైఖరితో ఆడండి.’ అని భారత క్రీడాకారులకు చెప్పారు.

* ఎంపికైన 215 మంది అథ్లెట్లు

భారత ఒలింపిక్ సంఘం(IOA) బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్ కోసం 322 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ప్రకటించింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ బండారీ క్రీడాకారుల బృందానికి చీఫ్‌గా వ్యవహరించనున్నారు. భారత క్రీడాకారులు మొత్తం 15 క్రీడలు, నాలుగు పారా క్రీడలలో పోటీ పడనున్నారు. ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, బజరంగ్‌ పునియా, రవికుమార్‌ దహియా వంటి ప్రముఖ క్రీడాకారులు ఈ బృందంలో ఉన్నారు. బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, వుమెన్స్‌ క్రికెట్‌, రెజ్లింగ్‌ వంటి క్రీడల్లో భారతదేశానికి పతకాలు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేసినా కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?


* అత్యుత్తమ క్రీడాకారులను పంపుతున్నాం..

ఇంతకు ముందు గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో.. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల వెనుక మూడో స్థానంలో నిలిచింది. భారత ఒలింపిక్‌ సంఘం సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా మాట్లాడుతూ..‘మా బలమైన స్క్వాడ్‌లలో ఎంపిక చేసిన ఉత్తమ క్రీడాకారుల బృందాన్ని కామన్వెల్త్‌ గేమ్స్‌కి పంపుతున్నాం. భారత్‌ బలంగా ఉండే షూటింగ్ క్రీడ, కామన్వెల్త్‌లో లేదు. అయినా గత ఎడిషన్ కంటే ఇప్పుడు మా పనితీరును మెరుగుపడుతుందని విశ్వసిస్తున్నాం. క్రీడాకారులు ఏ సందర్భంలోనూ తప్పు చేయకూడదు, ప్రపంచ స్థాయిలో గట్టి పోటీ ఎదురవుతుంది. మా అథ్లెట్లు బాగా సిద్ధమయ్యారు, ఫిట్‌గా ఉన్నారు. పోటీలకు వెళ్లడానికి, బరిలో దిగడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.’ అని చెప్పారు.

* ప్రత్యేక వసతి ఏర్పాట్లు

అథ్లెట్‌లు ఐదు స్పెషల్ గేమింగ్ విలేజెస్‌లో బస చేయనున్నారు. ఉమెన్ క్రికెట్ టీం సైతం బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. ఉమెన్ టీ20 క్రికెట్‌ తొలిసారిగా కామన్వెల్త్‌ క్రీడల్లో చోటు సంపాదించుకుంది. కొంత మంది భారత మహిళా క్రికెటర్‌లు ఇప్పటికే బర్మింగ్‌హామ్‌ చేరుకున్నారు. మిగిలిన ఆటగాళ్లు త్వరలో జట్టుతో చేరనున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Commonwealth Game 2022, Games, Modi, Prime minister, Sports

ఉత్తమ కథలు