• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • PM MODI INDEPENDENCE DAY SPEECH GOVERNMENT TO SPEND RS 100 LAKH CRORE ON REVAMPING COUNTRYS INFRASTRUCTURE

రూ.100 లక్షల కోట్లతో మౌలిక వసతుల రంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రతీకాత్మక చిత్రం

PM Modi Independence Day 2020 Speech | దేశంలో మౌలిక వసతుల రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు రూ.100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిన ప్రధాని నరేంద్ర మోదీ...నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  • Share this:
    PM Modi Independence Day Speech: దేశంలో మౌలిక వసతుల రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు రూ.100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిన ప్రధాని నరేంద్ర మోదీ...నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని...దీనికి నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు కింద మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. దీని కింద చేపట్టనున్న పలు రంగాలకు చెందిన దాదాపు 7 వేల ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. మౌలిక రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనున్న 110 జిల్లాలను గుర్తించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని పోర్ట్‌లను అనుసంధానిస్తూ 4 మార్గాల రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని ప్రకటించారు.



    దేశంలో ఇంటర్నెట్ కనెక్విటివీ అత్యంత వేగంగా విస్తరిస్తోందని సంతృప్తి వ్యక్తంచేశారు. మరో 1000 రోజుల్లో దేశంలోని 6 లక్షల గ్రామాలకు ఫైబర్ ఆప్టికల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించనున్నట్లు ప్రకటించారు.
    Published by:Janardhan V
    First published: