ఆసియాలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రెవా సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం 750 మెగా వాట్లు.

news18-telugu
Updated: July 10, 2020, 2:40 PM IST
ఆసియాలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
రేవా సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటైన 750 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని.. సోలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. రేవాలోని సౌర విద్యుత్ ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కూడా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే రోజుల్లో సౌరశక్తే ప్రధాన విద్యుత్ వనరుగా ఉంటుందని ఆయన చెప్పారు.

21వ శతాబ్దంలో ప్రధాన విద్యుత్ వనరు సౌరశక్తి. ఎందుకంటే ఇది నిశ్చితమైనది. నాణ్యమైనది. సురక్షితమైనది. రేవా ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రోకు కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. షాజాపూర్, నీముచ్, ఛతర్‌పూర్‌‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీకేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 22 డిసెంబర్ 2017న ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్లాంట్ పూర్తయింది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం 750 మెగా వాట్లు. ఇందులో మూడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రెవా ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం మధ్యప్రదేశ్ విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీ మెట్రోకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ , ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, ఎంపిలు, సహా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading