హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi in Varanasi: కాలభైరవ, కాశీ విశ్వనాథ ఆలయాల్లో మోదీ పూజలు -Kashi Vishwanath Dham

PM Modi in Varanasi: కాలభైరవ, కాశీ విశ్వనాథ ఆలయాల్లో మోదీ పూజలు -Kashi Vishwanath Dham

వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం వారణాసికి చేరుకున్న ప్రధానికి యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ తోపాటు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపే రెండు రోజుల పర్యటనను ఆలయ సందర్శనలతో ప్రారంభించారు ప్రధాని మోదీ.

ఇంకా చదవండి ...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి వచ్చారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం వారణాసికి చేరుకున్న ప్రధానికి యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ తోపాటు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపే రెండు రోజుల పర్యటనను ఆలయ సందర్శనలతో ప్రారంభించారు ప్రధాని మోదీ. వారణాసి విమానాశ్రయం నుంచి నేరుగా ఆలయాలకు వెళ్లారాయన..

ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించారు. ఆలయంలో ప్రధానికి అర్చకులు స్వాగతం పలికి, కండువా కప్పారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న మోదీ.. కాలభైరవుడికి హారతిపట్టారు. కాలభైరవ ఆలయం తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు. సొంత నియోజకవర్గం వారణాసి వచ్చిన ప్రతిసారి మోదీ ఈ రెండు ఆలయాలను సందర్శిస్తుండటం తెలిసిందే.


CM KCR : ఆలయ దర్శనం.. రాజకీయ వ్యూహం.. ఆసక్తికరంగా 2రోజుల తమిళనాడు పర్యటనకాలభైరవ, కాశీ విశ్వనాథ్ ఆలయాల్లో పూజల తర్వాత ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ (కాశీ విశ్వనాథ్ కారిడార్)ను ప్రారంభించనున్నారు. మోదీ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ లో భాగంగా దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. రూ.340 కోట్లు వ్యయంతో పురాతన ఆలయాలను పునరుద్దరించి, కొత్తగా 24 నిర్మాణాలను చేపట్టి అత్యాధునికంగా మార్చారు. దానిని ప్రధాని ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు.

First published:

Tags: Pm modi, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు