Home /News /national /

PM MODI IN JAPAN TWEETS IN JAPANESE PVN

Modi In Japan : టోక్యోలో మోదీ బిజీ బిజీ..జపనీస్ భాషలో ప్రధాని ట్వీట్లు

జపాన్ వ్యాపారవేత్తలతో మోదీ

జపాన్ వ్యాపారవేత్తలతో మోదీ

Modi Tweets In Japanese : దాదాపు 40 గంటల పాటు ప్రధాని మోదీ జపాన్‌లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధాన మంత్రులతో నిర్వహించే ద్వైపాక్షిక భేటీలతో పాటు వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి.

ఇంకా చదవండి ...
PM Modi In Japan :  క్వాడ్‌(QUAD) శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్‌(Japan) వెళ్లారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ.. సోమవారం ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు. ఈ మేరకు జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు జపాన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. జపనీస్ భాషలో చేసిన ట్వీట్ లో.."టోక్యోలో అడుగుపెట్టాను. ఈ పర్యటనలో క్వాడ్ సమ్మిట్, తోటి క్వాడ్ లీడర్‌లను కలవడం, జపనీస్ వ్యాపారవేత్తలు మరియు శక్తివంతమైన భారతీయ ప్రవాసులతో సంభాషించడం వంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాను"అని మోదీ పేర్కొన్నారు.

జపనీస్ భాషలోనే చేసిన మరో ట్వీట్ లో.."జపాన్‌లోని భారతీయ సమాజం భారతీయులుగా తమ మూలాలను కొనసాగిస్తూనే వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. జపాన్‌లో నివసిస్తున్న భారతీయులందరికీ తమ సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము"అని మోదీ పేర్కొన్నారు.

ALSO READ Dream11 : అదృష్టం అంటే నీదేనయ్యా..నిద్ర మధ్యలో లేచి ఫోన్ చూస్తే అకౌంట్ లో రూ.2 కోట్లు

ఇవాళ మధ్యాహ్నాం జపనీష్ భాషలోనే చేసిన మరో ట్వీట్ లో మోదీ.."టోక్యోలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలను కలిశాను. మా సంభాషణలు ఆవిష్కరణల నుండి పెట్టుబడులు, సాంకేతికత నుండి వస్త్రాలు, సంస్కరణల నుండి స్టార్టప్‌ల వరకు విభిన్న అంశాలపై దృష్టి సారించాయి. భారతదేశం పట్ల గొప్ప ఉత్సాహం ఉంది మరియు భారతదేశ యువత యొక్క వ్యవస్థాపక నైపుణ్యాల పట్ల గొప్ప ప్రశంసలు ఉన్నాయి"అని మోదీ పేర్కొన్నారు.

కాగా,మోదీతో సమావేశమైన వారిలో సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మరియు CEO మసయోషి సన్‌ కూడా ఉన్నారు. భారతీయ సాంకేతికత, ఇంధనం, ఫైనాన్స్ మరియు R&D రంగాలలో జపాన్ పెట్టుబడి సంస్థ భవిష్యత్తు భాగస్వామ్యం గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మరియు CEO మసయోషి సన్‌తో సమావేశమయ్యారు.



దాదాపు 40 గంటల పాటు ప్రధాని మోదీ జపాన్‌లో ఉంటారు. ఆ సమయంలో 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధాన మంత్రులతో నిర్వహించే ద్వైపాక్షిక భేటీలతో పాటు వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, భారత సంతతి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. మోదీ ఒక రాత్రి టోక్యోలో, మరో రెండు రాత్రులు విమాన ప్రయాణంలో ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Japan, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు