హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi | Garib Kalyan Sammelan : నేను ప్రధాన సేవకుణ్ని : మోదీ -PM Kisan డబ్బులు విడుదల

PM Modi | Garib Kalyan Sammelan : నేను ప్రధాన సేవకుణ్ని : మోదీ -PM Kisan డబ్బులు విడుదల

సిమ్లాలో గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ వేదికపై పీఎం మోదీ

సిమ్లాలో గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ వేదికపై పీఎం మోదీ

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మంగళవారం జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ వేదికపై నుంచే మోదీ దేశం నలుమూలల్లోని లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

‘గత 8 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా నన్ను నేను ప్రధానమంత్రిగా భావించలేదు. బాధ్యతల స్వీకార పత్రంపై సంతకం చేసినప్పుడు మాత్రమే నేను ప్రధానిని. ఆ మరుక్షణం నుంచి 130 కోట్ల మంది భారతీయులకు ప్రధాన సేవకుణ్ని మాత్రమే..’అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.  (PM Modi) అన్నారు. (PM Modi Address At Garib Kalyan Sammelan) గతంలో దేశ ప్రజలు కుంభకోణాలు, వారసత్వ పార్టీల హీన రాజకీయాలు, ఉంటాయో, ఊడతాయో తెలీని పథకాల గురించి మాట్లాడుకునేవారిని, అయితే ఇప్పుడు మాత్రం కేంద్రం పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన, వస్తోన్న మార్పుల గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రధాని అన్నారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, భారతావనిని విశ్వగురువుగా నిలబెట్టడమే ధ్యేయంగా గడిచిన ఎనిమిదేళ్లుగా అకుంఠిత సేవలో నిమగ్నమయ్యామని, న్యూ ఇండియా తన లక్ష్యాన్ని చేరుకున్న అద్భుత దృశ్యాన్ని మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సిటీలోని రిడ్జ్ మైదానంలో మంగళవారం ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ 11వ విడత నిధులను రైతుల ఖతాల్లోకి జమచేశారు.

PM Kisan Yojana : రైతులకు శుభవార్త.. నేడే బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ


కేంద్రంలో మోదీ పాలనకు 8ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్రం అమలు చేస్తోన్న సంక్షేమ, ప్రజాభ్యుదయ పథకాల విశేషాలు, విశిష్టతలను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మంగళవారం జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ వేదికపై నుంచే మోదీ దేశం నలుమూలల్లోని లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

సిమ్లా సిటీలోని రిడ్జ్ మైదానంలో మోదీ పాల్గొన్న గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కు జనం పోటెత్తారు. మోదీ సభకు వచ్చిన వారిలో 50 వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు కూడా ఉన్నారు. సిమ్లాతోపాటు దేశం నలుమూలలా పలు పట్టణాల్లో గరీబ్ కల్యాణ్ సమ్మేళనాలు నిర్వహించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరితోనూ మోదీ ముచ్చటించారు.

మహిళలు, బాలికలు, యువకులు, రైతులు, వృద్ధులు, వితంతువులు.. ఇలా సమాజంలోని వివిధ వర్గాల వారు తమకు అందుతోన్న కేంద్ర పథకాలను, వాటి ద్వారా తమ జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులను మోదీకి వివరించారు. లబ్దిదారుల మాటలకు ఉప్పొంగిపోయిన ప్రధాని.. మరింత కష్టపడి పనిచేసేందుకు మీరంతా ఉత్సాహం ఇచ్చారని వ్యాఖ్యానించారు. కేంద్రం అమలు చేస్తోన్న ఒక్కో పథకం గురించి ఆయా లబ్దిదారుల ద్వారానే ప్రధాని వివరాలు తెలుసుకున్నారు.

BJP | Dr K Laxman : బీజేపీ సంచలనం.. డా.కె. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు.. మైనార్టీ మంత్రికి మొడిచేయి!


సిమ్లాలో నిర్వహించిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ సభా వేదికపై నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతిష్టాత్మక పథకం ‘పీఎం కిసాన్’ 11వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేశారు. పీఎం కిసాన్ ప‌థ‌కం 11వ విడతలో భాగంగా రూ.21,000 కోట్ల‌కుపైగా నిధుల‌ను లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి వేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Himachal Pradesh, PM KISAN, PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme, Pm modi, Shimla

ఉత్తమ కథలు