PM Modi Independence Day Speech : దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independence Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అవినీతి, వారసత్వం అనే రెండు అంశాల గురించి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అవినీతి,వారసత్వం అనే చెదపురుగులు భారత్‌ను పట్టిపీడిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ రెండింటిని భారత్ ప్రజాస్వామ్య మనుగడకు సాధ్యమవుతుందన్నారు. అవినీతి,వారసత్వాలను జనజీవనం నుంచి పూర్తి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించినప్పుడే సామాన్యుల జీవితం మెరుగుపుడుతుందని ప్రధాని అన్నారు. అవినీతి, వారసత్వాలను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు.
దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించినప్పుడే సామాన్యుల జీవితం మెరుగుపుడుతుందని ప్రధాని అన్నారు. అవినీతికి పాల్పడేవారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు. అవినీతిపై పోరుకు తనకు ప్రజల సహకారం కావాలని మోదీ కోరారు. అవినీతిని చూసి దేశం కోపగించుకుంటోంది తప్ప అవినీతిపరులను కాదు... ఈ తీరు మారాలన్నారు. అవినీతిపరులను క్షమిస్తే దేశ భివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అవినీతి చేసిన వ్యక్తులనూ శిక్షించాలన్న భావన ఏర్పడితేనే దేశం వేగంగా పురోగతి సాధిస్తుందన్నారు. మన సత్తా అంతా కూడగట్టుకొని అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాము సఫలమయ్యామని...ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, మొబైల్ ఫోన్లు ఉపయోగించి గడిచిన ఎనిమిదేళ్లలో రూ.2లక్షల కోట్ల నల్లధనాన్ని గుర్తించాం అని మోదీ తెలిపారు. అవినీతిని పారద్రోలాలని... దేశం విడిచి పారిపోయిన వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఇక, బంధుప్రీతి, వారసత్వాల గురించి తాను మాట్లాడితే రాజకీయం గురించి ప్రస్తావిస్తున్నా అని అనుకుంటారని...కానీ, దురదృష్టవశాత్తు ఈ కుటుంబ రాజకీయాలే ప్రతి రంగంలో బంధుప్రీతిని పెంచిపోషించాయన్నారు. దీని వల్ల ప్రజస్వామ్యానికి విఘాతం వాటిల్లుతోందన్నారు. వారసత్వం కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకుండా చేస్తున్నదని మోదీ అన్నారు. వారసత్వాన్ని ఆదరించడం.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని చెప్పారు. ఇది కేవలం రాజకీయాలకే పరిమితం కాదని,సంస్థల్లో, క్రీడల్లో దీన్ని మనం నిరుత్సాహపరచాలని మోదీ అన్నారు. దానికి వ్యతిరేకంగా మనం విప్లవం ప్రారంభించాలిన్నారు. ఇది మన సామాజిక బాధ్యత.. మనకు పారదర్శకత అవసరం అని ప్రధాని అన్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు రావాలి.. ఎవరైతే అర్హులు ఉంటారో వారికే అవకాశాలు దక్కాలి అని మోదీ అన్నారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు సహకరించాలని మోదీ కోరారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corruption, Independence Day 2022, Pm modi