భారత్ పెట్టుబడులకు స్వర్గధామం - ఆసియన్ సదస్సులో ప్రధానిమోదీ

పారదర్శక పాలనతోపాటు, పన్నులు, పన్ను రేట్ల పునర్వ్యవస్థీకరణ భారత్ లో పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మోదీ తెలిపారు.

news18-telugu
Updated: November 3, 2019, 10:11 PM IST
భారత్ పెట్టుబడులకు స్వర్గధామం - ఆసియన్ సదస్సులో ప్రధానిమోదీ
REUTERS/Athit Perawongmetha
  • Share this:
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైనమని ప్రధాని నరేంద్ర మోడీ ఆసియన్ దేశాలకు పిలుపునిచ్చారు. బ్యాంకాక్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ బహిరంగ సభను ఉద్దేశించి పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని అందుకు చాలా నమ్మకంతో ఉన్నామని మోదీ అన్నారు. భారత్‌లో సానుకూల మార్పులు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నామని మోదీ తెలిపారు. వ్యాపారానికి అనుకూలంగా మౌలిక సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయన్నారు. అలాగే పారదర్శక పాలనతోపాటు, పన్నులు, పన్ను రేట్ల పునర్వ్యవస్థీకరణ భారత్ లో పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మోదీ తెలిపారు. అలాగే దేశంలో అవినీతి, లంచగొండితనం, వ్యక్తిగత రికమెండేషన్లు తగ్గుతున్నాయన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, వ్యాపారం చేసుకోవాలనుకునేవారు భారత్ కు రావొచ్చని. గత ఐదేళ్లలో జీడీపీ పెరిగేలా చేశాం. 5ట్రిలియన్ యూఎస్ డాలర్లు ఎకానమీని టార్గెట్ గా పెట్టుకుని దూసుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.
Published by: Krishna Adithya
First published: November 3, 2019, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading