బాపూజీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. ఆయన మహోన్నతమైన ఆశయాలను మరింతగా ప్రచారం చేయడమే మన సమిష్టి ప్రయత్నం కావాలంటూ ప్రధాని మోదీ నివాళి అర్పించారు..
భారత జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. జాతిపిత ఆశయాలను సాధించడానికి, వాటిని మరింత మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మనమంతా సమిష్టిగా ప్రయత్నించాలని ప్రధాని అన్నారు. మహాత్ముడి వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగానూ జరుపుకొంటున్న సందర్భాన్ని మోదీ ప్రస్తావించారు.
‘బాపూజీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. ఆయన మహోన్నతమైన ఆశయాలను మరింతగా ప్రచారం చేయడమే మన సమిష్టి ప్రయత్నం కావాలి. ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిని ధైర్యంగా కాపాడిన మహనీయులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. దేశానికి వారి సేవలు, ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’అని ప్రధాని మోదీ కొద్ది సేపటి కిందట ట్వీట్ చేశారు.
Remembering Bapu on his Punya Tithi. It is our collective endeavour to further popularise his noble ideals.
Today, on Martyrs’ Day, paying homage to all the greats who courageously safeguarded our nation. Their service and bravery will always be remembered.
గాంధీజీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నివాళి అర్పించారు. బాపూజీ ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్ స్ఫూర్తిని నింపారని అన్నారు. ‘మహాత్మా గాంధీ ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్య స్ఫూర్తిని నింపారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు జాతికి సేవ చేసేలా ప్రతి భారతీయుడిని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాయి. ఈ రోజు, గౌరవనీయులైన బాపు వర్ధంతి సందర్భంగా, నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను’అని అమిత్ షా ట్వీట్ చేశారు.
महात्मा गांधी जी ने हर भारतीय के हृदय में स्वदेशी, स्वभाषा और स्वराज की अलख जगाई। उनके विचार और आदर्श सदैव हर भारतवासी को राष्ट्रसेवा के लिए प्रेरित करते रहेंगे।
आज पूज्य बापू की पुण्यतिथि पर उन्हें नमन कर श्रद्धांजलि देता हूँ।
భారత్ లో ప్రతి ఏడాది జనవరి 30 న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని గౌరవించటానికి అమరవీరుల దినోత్సవాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. 1948, జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లోని గాంధీ స్మృతి వద్ద మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 30న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.