Home /News /national /

PM MODI HAILS DEVOTION TO MAA KAALI BY INDIAN SAINTS AT ATMASTHANANDA CENTENARY BJP ASKS TMC TO TAKE A LESSON MKS

PM Modi | Maa Kaali : కాళీమాతపై వివాదం వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. గుణపాఠమన్న బీజేపీ

ఆత్మస్థానంద శతజయంతిలో ప్రధాని మోదీ ప్రసంగం

ఆత్మస్థానంద శతజయంతిలో ప్రధాని మోదీ ప్రసంగం

భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని, ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని అన్నారు. తన ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మస్థానంద శతజయంతి సందర్భంగా నివాళులర్పించారు..

కాళీమాతపై అనుచిత పోస్టర్ వివాదం (Maa Kaali Poster Row) రాజకీయ మలుపు తీసుకున్నవేళ వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని, ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని అన్నారు. తన ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మస్థానంద శతజయంతి సందర్భంగా ఆదివారం ఆయన ఘనంగా నివాళులర్పించారు. స్వామి ఆత్మస్థానందతో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరించారు.

ఆత్మస్థానంద ఆశీస్సులు లభించడం తన భాగ్యమన్నారు. స్వామి ఆత్మస్థానంద చివరి క్షణాల్లో కూడా తాను ఆయన వద్దే ఉన్నానని మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానానంద... స్వామి ఆత్మస్థానందకు మంత్ర దీక్ష ఇచ్చారని ప్రధాని తెలిపారు.

Man Menstrual Periods : పురుషుడికి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే..


భారత్‌లో అనాదిగా సన్యాస మార్గం ఉందని, ఈ మార్గం ద్వారా సాధు సన్యాసులు లోక కళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని మోదీ చెప్పారు. ఆది శంకరాచార్య, స్వామి వివేకానందను గుర్తు చేసుకుంటూ ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని వారు పాటించారని ప్రధాని గుర్తు చేశారు.


Union Cabinet : కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. తెలంగాణకు మరో బెర్త్.. జగన్ వైసీపీకీ అహ్వానం?


ఇదిలా ఉంటే, కెనడాలో నివసిస్తోన్న ఫిలిం మేకర్‌ లీనా మణిమేఖలై ఇటీవల కాళీ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీలో కాళీమాత పాత్రధారిణితో సిగరెట్ తాగించిన ఉదంతం, సంబంధిత పోస్టర్ వివాదాస్పదం కావడం, దానిపై స్పందిస్తూ కాళీ మాతను తాను మాంస భక్షకిగా, మద్యపానాన్ని సేవించే వ్యక్తిగా ఊహించుకునే హక్కు తనకు ఉందంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యానించడం తెలిసిందే. టీఎంసీ నేతపై కేసులు పెట్టిన బీజేపీ నేతలు.. ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యలు వారికి(టీఎంసీ నేతలకు) గుణపాఠమని అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు